Nandamuri Balakrishna : వాళ్లు తొడ‌గొడితే నేను మీసం తిప్పా

న‌టుడు, ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌

Nandamuri Balakrishna : గుంటూరు – ఏపీ అసెంబ్లీ ఇవాళ ర‌ణ‌రంగంగా మారింది. అధికార , ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యుల మ‌ధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. చివ‌ర‌కు ఒక‌రిపై మ‌రొక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు , స‌వాళ్లు చేసుకున్నారు. దీంతో ప‌రిస్థితి అదుపు త‌ప్ప‌డంతో స్పీక‌ర్ త‌మ్మినేని శ్రీ‌రామ్ సీరియ‌స్ అయ్యారు. స‌భ్యుల‌ను స‌స్పెండ్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

Nandamuri Balakrishna Comment

రేప‌టికి స‌భ‌ను వాయిదా వేశారు. ఈ సంద‌ర్బంగా త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్న అధికార పార్టీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ‌(Nandamuri Balakrishna). ముందుగా వాళ్లు త‌న‌ను చూసి తొడ గొట్టారని మండిప‌డ్డారు. అందుకే తేల్చుకుందాం అంటూ మీసం తిప్పాన‌ని ఇందులో త‌ప్పేముందంటూ ప్ర‌శ్నించారు.

తేల్చుకుందాం రా అంటూ కౌంట‌ర్ ఇచ్చాన‌ని చెప్పారు బాల‌కృష్ణ‌. త‌న బావ చంద్ర‌బ‌బు నాయుడును అన‌వ‌స‌రంగా ఇరికించారంటూ ఆరోపించారు. ఇందులో ఎలాంటి అవినీతి, అక్ర‌మాలు జ‌ర‌గ‌లేద‌ని చెప్పారు. కావాల‌ని కేసు న‌మోదు చేశార‌ని ఫైర్ అయ్యారు.

ఇవాళ శాస‌న స‌భ‌లో చోటు చేసుకున్న ప‌రిణామాల ప‌ట్ల తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త‌ల్లి లాంటి త‌న వృత్తిని అంబ‌టి రాంబాబు అవ‌మానించారంటూ ఆరోపించారు. అందుకే ద‌మ్ముంటే రావాల‌ని స‌వాల్ విసిరాన‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : RK Roja Selvamani : బావ కోసం బాల‌కృష్ణ మీసం

Leave A Reply

Your Email Id will not be published!