Perni Nani : ప‌ద‌వి కోసం మామా అల్లుళ్ల పోరాటం

నిప్పులు చెరిగిన మాజీ మంత్రిర పేర్ని నాని

Perni Nani : తాడేప‌ల్లి గూడెం – ఏపీ మాజీ మంత్రి పేర్ని (వెంక‌ట్రామయ్య‌) నాని షాకింగ్ కామెంట్స్ చేశారు. శ‌నివారం ఏపీ అసెంబ్లీలో ఏపీ స్కిల్ స్కాంపై జ‌రిగిన చ‌ర్చ‌లో భాగంగా నాని పాల్గొని ప్ర‌సంగించారు. ఓ వైపు ఏపీ స్కిల్ స్కాంలో అడ్డంగా దొరికి పోయి రాజ‌మండ్రి జైలులో చంద్ర‌బాబు ఉండ‌గానే ఇంకో వైపు ఆయ‌న పార్టీని, ఆఫీసును, కుర్చీని క‌బ్జా చేసేందుకు బాబు బావ‌మ‌రిది హిందూపురం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ ప్లాన్ చేశాడంటూ ఆరోపించారు.

Perni Nani Shocking Comments on Balakrishna

ఇదే స‌మ‌యంలో అల్లుడు నారా లోకేష్ సైతం పార్టీ చీఫ్ ప‌ద‌వి కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు. టీడీపీని క‌బ్జా చేసుకునేందుకు మామా అల్లుళ్లు ప్ర‌య‌త్నం చేస్తుండ‌డం నిజం కాదా అని నిల‌దీశారు మాజీ మంత్రి పేర్ని నాని(Perni Nani).

ఏపీ స్కిల్ స్కాంలో రూ. 371 కోట్లు చేతులు మారాయంటూ ఏపీ సీఐడీ కేసు న‌మోదు చేసింది. ఏసీబీ కోర్టు కోలుకోలేని షాక్ ఇచ్చింది నారా చంద్ర‌బాబు నాయుడుకు. 14 రోజుల క‌స్ట‌డీ విధించింది. గ‌డువు పూర్తి కావ‌డంతో శుక్ర‌వారం ఏపీ సీఐడీకి 2 రోజులు క‌స్ట‌డీకి ఇచ్చింది కోర్టు. మ‌రో వైపు హైకోర్టులో దాఖ‌లు చేసిన క్వాష్ పిటిష‌న్ ను కొట్టివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో చంద్ర‌బాబు త‌ర‌పు న్యాయ‌వాదులు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.

Also Read : Tirumala Rush : తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ

Leave A Reply

Your Email Id will not be published!