Minister KTR : కేటీఆర్ కు అరుదైన ఆహ్వానం
అమెరికా వేదికపై ప్రసంగించాలని
Minister KTR : హైదరాబాద్ – ఐటీ, పురపాలిక , పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కు అరుదైన ఆహ్వానం లభించింది. ప్రపంచ వేదికపై తెలంగాణ ప్రభుత్వం సాధించిన ప్రగతి పై ప్రత్యేకించి వ్యవసాయ రంగంలో సాధించిన పురోగతి, చేపట్టిన సంస్కరణలు, తీరు తెన్నులపై ప్రసంగించాల్సిందిగా ఆహ్వానం అందింది కేటీఆర్ కు.
ఈ ఏడాది అమెరికాలో నార్మన్ బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్ పేరుతో కీలక సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో పాల్గొని తమ అనుభవాలను తెలియ చేయాల్సిందిగా కేటీఆర్(Minister KTR ) కు సంస్థ నిర్వాహకుల తరపున ఇన్విటేషన్ లభించింది.
Minister KTR Got Special Invitation
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలో అన్ని రంగాలలో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకించి ఐటీ, లాజిస్టిక్, ఫార్మా రంగాలలో ముందంజలో కొనసాగుతోంది. దీని వెనుక సీఎం కేసీఆర్ కృషి ఎంతగానో ఉంది.
ఇప్పటికే ఐటీ , వ్యవసాయ పరంగా దేశంలోనే టాప్ లో నిలిచింది తెలంగాణ. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులను, ఎత్తి పోతల పథకాలను నిర్మించింది. భారీ ఎత్తున ఖర్చు చేసింది. ఇవాళ తెలంగాణ మొత్తం సశ్యశ్యామలంగా మారింది. ఇందుకు వ్యవసాయ శాఖ మంత్రి కూడా కృషి చేశారు.
కేటీఆర్ కు ఆహ్వానం రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే ఆయన సమావేశంలో హాజరు కానున్నారు.
Also Read : Yepuri Somanna : కారెక్కిన ఏపూరి సోమన్న