Amruta Fadnavis : అమృత ఫ‌డ్న‌వీస్ వైర‌ల్

త‌ల్లీ కూతురు ఫోటోస్ హ‌ల్ చ‌ల్

Amruta Fadnavis : మ‌హారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ భార్య అమృత ఫ‌డ్న‌వీస్ వైర‌ల్ గా మారారు. త‌న కూతురుతో క‌లిసి మోడ్ర‌న్ దుస్తుల‌తో క‌నిపించారు. ఇందుకు సంబంధించిన ఫోటోల‌ను షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఇవి హాట్ టాపిక్ గా మారాయి.

అమృత ఫ‌డ్న‌వీస్(Amruta Fadnavis) వ‌య‌సు 44 ఏళ్లు. ఏప్రిల్ 9, 1979లో పుట్టారు. బ్యాంక‌ర్, న‌టి, గాయ‌ని, సామాజిక కార్య‌కర్త‌గా గుర్తింపు పొందారు. యాక్సిస్ బ్యాంక్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంత‌ర్జాతీయ శాంతి చొర‌వ‌, నేష‌న‌ల్ ప్రేయ‌ర్ బ్రేక్ ఫాస్ట్ లో భార‌త దేశం త‌ర‌పున ప్రాతినిధ్యం వ‌హించారు.

Amruta Fadnavis Viral on Social Media

అండ‌ర్ 16 లో టెన్నిస్ క్రీడాకారిణిగా ఉన్నారు. ఎంబీఏ చేసింది. 2003లో యాక్సిస్ బ్యాంక్ లో చేరింది. అంచెలంచెలుగా ఉన్న‌త స్థానానికి చేరుకుంది. నాగ్ పూర్ బిజినెస్ బ్యాంకుకు నాయ‌క‌త్వం వ‌హించింది అమృత ఫ‌డ్న‌వీస్. 17 ఏళ్లుగా స‌ద‌రు బ్యాంకులో ప‌ని చేస్తున్నారు.

శాస్త్రీయ సంగీతంలో ఆరేళ్ల వ‌య‌సు నుండి మెళ‌కువ‌లు నేర్చుకున్నారు. అనేక సామాజిక కార్య‌క్ర‌మాల‌లో పాల్గొన్నారు. ప్ర‌కాశ్ ఝా జై గంగాజ‌ల్ లో స‌బ్ ధ‌న్ మ‌తి అనే పాట‌తో ప్లే బ్యాక్ సింగ‌ర్ గా కూడా స్టార్ట్ చేశారు. సంఘ‌ర్ష్ యాత్ర‌లో ఒక పాట పాడింది. అమితాబ్ న‌టించిన ఫిర్ సే ఆల్బం రికార్డ్ బ్రేక్ చేసింది. దీనిని టి సీరీస్ విడుద‌ల చేసింది. ప‌లు పాట‌లతో గుర్తింపు పొందారు .

Also Read : Minister KTR : కేటీఆర్ కు అరుదైన ఆహ్వానం

Leave A Reply

Your Email Id will not be published!