Nara Lokesh : ఏపీ స‌ర్కార్ కు పాడె క‌ట్ట‌డం ఖాయం

టీడీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్

Nara Lokesh : అమ‌రావ‌తి – తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఏపీ స‌ర్కార్ పై తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి పాడె క‌ట్ట‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం అనేది ఉందా అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు.

Nara Lokesh  Comments on AP Govt

మంగ‌ళ‌వారం నారా లోకేష్(Nara Lokesh) మీడియాతో మాట్లాడారు. ఆందోళ‌న‌లు, రాస్తారోకోలు, నిర‌స‌న‌లు తెల‌ప‌డం ప్ర‌జ‌ల హ‌క్కు అని స్ప‌ష్టం చేశారు. ఈ ప్ర‌భుత్వానికి ఘోరీ క‌ట్టేందుకు ప్ర‌జ‌లు సిద్దంగా ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు.

నిర‌స‌న‌ల మాట వింటేనే ఏపీ సీఎం జ‌గ‌న్ రెడ్డి ఉలిక్కి ప‌డుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. త‌మ న్యాయ ప‌ర‌మైన హ‌క్కుల కోసం రోడ్డెక్కిన అంగ‌న్ వాడీల‌పై ఖాకీలు ఇంత‌గా దాడుల‌కు పాల్ప‌డ‌తారా అని ప్ర‌శ్నించారు.

రాష్ట్రంలో ద‌మ‌న కాండ‌ను ప్ర‌తి ఒక్క‌రు గ‌మ‌నిస్తూనే ఉన్నార‌ని అన్నారు నారా లోకేష్. ప్ర‌భుత్వం తప్పు చేసింది కాబాట్టే ప్ర‌జ‌ల‌ను చూసి భ‌య‌ప‌డుతోంద‌ని ఎద్దేవా చేశారు. ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ‌లో భాగ‌మైన మ‌హిళ‌ల ప‌ట్ల అమానుషంగా ప్ర‌వ‌ర్తించడాన్ని తమ పార్టీ పూర్తిగా ఖండిస్తుంద‌న్నారు.

Also Read : Ambati Ram Babu : లోకేష్ లొకేష‌న్ ఎక్క‌డ‌

Leave A Reply

Your Email Id will not be published!