AP Students : ఏపీ విద్యార్థులు భేష్ – వరల్డ్ బ్యాంకు
విద్యా రంగంపై ఏపీ సర్కార్ కృషి
AP Students : వరల్డ్ బ్యాంకు ఏపీ విద్యార్థుల ప్రతిభను గుర్తించింది..ప్రశంసలతో ముంచెత్తింది. ఏపీ ప్రభుత్వం విద్యా రంగానికి ప్రయారిటీ ఇస్తోంది. ప్రత్యేకించి ఏపీ సీఎం జగన్ రెడ్డి(CM YS Jagan) నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చిన్నారులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాను అందించేలా చేస్తున్నారు. అంతే కాకుండా కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దారు.
AP Students Viral in World Bank
తాజాగా ఏపీ రాష్ట్రానికి సంబంధించి 10 మంది విద్యార్థులతో కూడిన బృందం వరల్డ్ బ్యాంకును సందర్శించింది. వీరితో పాటు ఇద్దరు టీచర్లు, ఎస్ఎస్ఏ పీడీ బీ శ్రీనివాసరావు , సీనియర్ అధికారులు ఉన్నారు.
వాషింగ్టన్ డీసీలోని వరల్డ్ బ్యాంకును సందర్శించారు. వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు రిఫాత్ హసన్ , ట్రేసీ విలిచౌస్కీ తో పాటు ప్రముఖులతో విద్య, ఆరోగ్యంపై విస్తృతంగా చర్చించారు. సీనియర్ ఎడ్యుకేషన్ స్పెషలిస్ట్ లారా గ్రెగోరీ ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు.
అమ్మ ఒడి, నాడు నేడు, ఆంగ్ల ప్రవేశం , ద్విభాషా పాఠ్య పుస్తకాల వినియోగం సహా విద్యా రంగంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి అమలు చేస్తున్న కార్యక్రమాలను వరల్డ్ బ్యాంకు ప్రశంసించింది. ప్రభుత్వ పాఠశాలల్లో కార్యాచరణ క్లబ్ ల పరిచయం చేయాలని కోరింది.
Also Read : Jayesh Ranjan : రక్షర రంగంలో ఏఐ కీలకం