Nara Lokesh : లోకేష్ ముందస్తు బెయిల్ దాఖలు
ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన నారా
Nara Lokesh : ఆంధ్రప్రదేశ్ – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బుధవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ , అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం కేసులో నారా లోకేష్ ను ఏపీ సీఐడీ ఎ14గా చేర్చింది. ఈ మేరకు అరెస్ట్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టులో మెమో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు నారా లోకేష్ కు నోటీసులు జారీ చేసేందుకు రెడీ అయ్యింది.
Nara Lokesh Approach High Court
ఈ తరుణంలో తాను యువ గళం పాదయాత్ర తిరిగి చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం తన తండ్రి ఏపీ స్కిల్ స్కాం కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పటికే ఏపీ సీఐడీ 2 రోజుల పాటు విచారణ చేపట్టింది. ఏసీబీ కోర్టు విచారణకు సంబంధించి 5 రోజులు అడుగగా కేవలం 2 రోజులు మాత్రమే అనుమతి ఇచ్చింది.
ఇదే కేసులో నారా లోకేష్(Nara Lokesh) పేరు కూడా వచ్చింది. ప్రస్తుతం లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు నారా లోకేష్. ఏపీకి వచ్చిన వెంటనే అదుపులోకి తీసుకునేందుకు రెడీ అయ్యారు ఏపీ సీఐడీ పోలీసులు. ముందే విషయం తెలుసుకున్న నారా లోకేష్ ముందస్తుగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు బెయిల్ ఇవ్వాలని కోరారు.
Also Read : Hyper Market MD : తెలంగాణలో రూ. 3,500 కోట్లు