Varudu Kalyani : భువనేశ్వరీ.. 20 వేల కోట్ల కథేంటి
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి కామెంట్స్
Varudu Kalyani : విశాఖపట్నం – వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి(Varudu Kalyani) నిప్పులు చెరిగారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా దొరికి పోయి రాజమండ్రి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు ఏం చేస్తే రూ. 20 వేల కోట్లు సంపాదించాడో చెప్పాలని నిలదీశారు.
Varudu Kalyani Comments on Bhuvaneswari
తాజాగా చంద్రబాబు నాయుడు భార్య నారా భువనేశ్వరి దేవి తమ ఆస్తి ఇరవై వేల కోట్లు ఉంటుందని చెప్పారని , ఏం చేసి సాధించారో ఏపీ ప్రజలకు, దేశానికి తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు కేవలం 2 ఎకరాల ఆస్తి మాత్రమే ఉన్న చంద్రాబు నాయుడుకు ఇన్ని వేల ఆస్తులను ఎలా కూడబెట్టాడో బహిరంగ పర్చాలని కోరారు.
అవినీతికి పాల్పడకుండా ఇన్ని వేల కోట్లు వచ్చాయంటే ఎవరూ నమ్మలేరన్నారు. ఎన్నేళ్లు కష్టపడితే పాలు, పెరుగు అమ్మితే రూ. 20 వేల కోట్లు సంపాదిస్తారా అని ప్రశ్నించారు. ఒకవేళ ఆ సక్సెస్ మంత్ర ఏమిటో ప్రజలకు నారా భువనేశ్వరి చెబితే ప్రజలు కూడా పాలు, పెరుగు అమ్ముతారంటూ స్పష్టం చేశారు వరుదు కళ్యాణి.
పక్కా ఆధారాలు ఉన్నందు వల్లనే ఏపీ సీఐడీ నారా చంద్రబాబు ను అరెస్ట్ చేసిందన్నారు. ఇక అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాంలో సైతం నారా లోకేష్ ను వెంటనే అదుపులోకి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన వారు బయట ఉంటే ఎలా అని ప్రశ్నించారు.
Also Read : Ponnala Lakshmaiah : బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి