Minister KTR : కిటెక్స్ చీఫ్ జాకబ్ కు థ్యాంక్స్ – కేటీఆర్
తెలంగాణలో కంపెనీ భారీ పెట్టుబడి
Minister KTR : హైదరాబాద్ – తెలంగాణలో ప్రముఖ వస్త్ర వ్యాపార తయారీ సంస్థ కిటెక్స్ సంస్థ భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని స్పష్టం చేశారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా సదరు సంస్థ కిటెక్స్ చీఫ్ సాబు జాకబ్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఈ ఫ్యాక్టరీ ప్రపంచం లోనే అతి పొడవైన అసెంబ్లింగ్ లైన్ కలిగి ఉంటుందన్నారు. వరల్డ్ వైడ్ గా చూస్తే చిన్న పిల్లలకు సంబంధించి కిడ్స్ వేర్ తయారు చేయడంలో రెండో అతి పెద్ద కంపెనీగా నిలిచంది. ఇదిలా ఉండగా కిటెక్స్ కంపెనీ తెలంగాణను ఎంచుకుంది. ఈ మేరకు సంతోషంగా ఉందన్నారు కేటీఆర్.
Minister KTR Comment
రూ. 1200 కోట్ల పెట్టుబడితో సమీకృత ఫైబర్ టు అప్పరల్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ను ఏర్పాటు చేయడాన్ని వెల్ కమ్ చెబుతున్నట్లు పేర్కొన్నారు ఐటీ మంత్రి(Minister KTR).250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ క్లస్టర్ రోజుకు 7 లక్షల గార్మెంట్స్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు కేటీఆర్.
ఇది వచ్చే ఏడాది 2024 డిసెంబర్ నాటికి పూర్తిగా పని చేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈ కంపెనీ పని చేయడం ప్రారంభిస్తే భారీ ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయన్నారు. 11 వేల మందికి పైగా జాబ్స్ వస్తాయని చెప్పారు.
Also Read : Gadikota Srikanth Reddy : తండ్రీ కొడుకులు పాత్రదారులు