Nara Brahmani : రాజమండ్రి – నారా చంద్రబాబు నాయుడు కోడలు , హెరిటేజ్ మేనేజింగ్ డైరెక్టర్ నారా బ్రాహ్మణి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మీడియాతో మాట్లాడారు. ఎపీ స్కిల్ స్కామ్ కేసు పూర్తిగా నిరాధారమైనదని పేర్కొన్నారు. కేవలం రాజకీయ కక్షతో తన మామను ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రయత్నం చేశారని ఆరోపించారు.
ఏదో ఒక రోజు ప్రజలు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి చుక్కలు చూపించడం ఖాయమన్నారు. ఏపీ సీఐడీ అరెస్ట్ చేసిందే తప్పా చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించ లేక పోయిందని ఆరోపించారు నారా బ్రాహ్మణి.
Nara Brahmani Shocking Comments
పాలకుల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందన్నారు. వీరి ఆగడాలకు అడ్డు చెప్పక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యంగా ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగి పోతుందన్నారు.
రాష్ట్ర జనాలందరికీ చంద్రబాబు నాయుడు అంటే ఏమిటో తెలుసన్నారు. ఆయనను అక్రమంగా నిర్బంధించారని , దీనిని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు నారా బ్రాహ్మణి(Nara Brahmani ). ఇవాళ ఆయనకు మద్దతుగా రాత్రి 7 నుండి 7.05 వరకు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించాలని పిలుపునిచ్చారు. ఒక పల్లెం తీసుకుని గరిటెతో కొట్టాలని , లేదా విజిల్ వేయాలని , రోడ్డు ప్రయాణంలో ఉంటే హారన్ వినిపించాలని కోరారు నారా బ్రాహ్మణి.
Also Read : Varudu Kalyani : చంద్రబాబు నియంత..గజదొంగ