Minister KTR : మోసానికి చిరునామా మోదీ – కేటీఆర్
బీజేపీ అదానీ చేతిలోకి వెళ్లి పోయింది
Minister KTR : హైదరాబాద్ – ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. హామీలు ఇవ్వడం, నమ్మించి మోసం చేయడంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆరి తేరారంటూ మండిపడ్డారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇంకెన్నిసార్లు మాయ మాటలు చెబుతారంటూ ప్రశ్నించారు.
Minister KTR Comments on PM Modi
దేశంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఇది తెలుసుకుంటే మంచిదన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ పార్టీ స్టీరింగ్ తమ బాస్ సీఎం కేసీఆర్ చేతిలో పదిలంగా ఉందన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ స్టీరింగ్ మాత్రం అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ చేతిలో ఉందని ఎద్దేవా చేశారు.
కిసాన్ సమాన్ పథకం వల్ల కొందరికి మాత్రమే లబ్ది చేకూరుతోందని కానీ తమ సర్కార్ తీసుకు వచ్చిన రైతు బంధు పథకం ద్వారా ఇప్పటి వరకు రూ. 76 వేల కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు కేటీఆర్(Minister KTR). ఇలాంటి పథకం, పంపిణీ దేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో జరగలేదన్నారు కేటీఆర్.
ఇప్పటికైనా నోరు పారేసుకునే ముందు ఆలోచించి మాట్లాడాలని బీజేపీ నేతలకు సూచించారు మంత్రి. తమ పథకం వల్ల ప్రతి సారి 70 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరుతోందన్నారు. తాము రెండు సార్లు రుణ మాఫీ చేయడం జరిగిందని చెప్పారు.
Also Read : Tirumala Rush : పుణ్య క్షేత్రం భక్త జన సందోహం