Nara Lokesh : మోత మోగిస్తే కేసులా – లోకేష్

ఏపీ సీఎం జ‌గ‌న్ పిచ్చి పీక్స్ లో ఉంది

Nara Lokesh : న్యూఢిల్లీ – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఏపీ స్కిల్ స్కాంలో నిరాధార ఆరోప‌ణ‌లు మోపి అరెస్ట్ చేసిన నారా చంద్ర‌బాబు నాయుడుకు సంఘీ భావంగా టీడీపీ ఆధ్వ‌ర్యంలో మోత మోగిస్తూ మ‌ద్ద‌తు తెలిపారని పేర్కొన్నారు నారా లోకేష్.

Nara Lokesh Comment

ఇందులో భాగంగా ప‌లువురు పార్టీకి చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌పై ఏపీ పోలీసులు బ‌ల‌వంతంగా కేసులు న‌మోదు చేయ‌డాన్ని తీవ్రంగా తప్పు ప‌ట్టారు. రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది లేద‌ని, కేవ‌లం రాజా రెడ్డి రాజ్యాంగం అమ‌లు జ‌రుగుతోంద‌ని ఆరోపించారు.

విచిత్రం ఏమిటంటే విజిల్స్ వేసి సౌండ్ చేశార‌ని 60 మందిపై కేసు న‌మోదు చేశార‌ని దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నాన‌ని పేర్కొన్నారు. సోమ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించారు. పోలీస్ స్టేష‌న్ కు పిలిచి విచారిస్తారా అని తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు నారా లోకేష్(Nara Lokesh).

ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వం, పోలీసుల తీరు చూస్తుంటే నారా చంద్ర‌బాబు నాయుడు వార్త‌లు టీవీలో చూశార‌ని చూసిన ప్ర‌తి ఒక్క‌రిపై కూడా కేసు న‌మోదు చేసేట‌ట్లు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఒక ర‌కంగా చెప్పాలంటే ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి పిచ్చి భారీగా ముదిరిందంటూ ఆరోపించారు.

Also Read : Pawan Kalyan : జీఈఆర్ స‌ర్వేపై లెక్క‌లు తేల్చాలి

Leave A Reply

Your Email Id will not be published!