PM Modi KCR : మోదీ కామెంట్స్ కలకలం
తెలంగాణలో సంచలనం
PM Modi KCR : హైదరాబాద్ – ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సీఎం కేసీఆర్ పై చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో ఉన్నట్టుండి బాంబు పేల్చారు ప్రధాని.
PM Modi KCR Comments
గతంలో లేని రీతిలో మోదీ నిప్పులు చెరిగారు. ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఎన్డీయేలో చేరుతానంటూ నా వద్దకు వచ్చారు సీఎం కేసీఆర్ అని చెప్పారు. కానీ దానికి తాను ఒప్పుకోలేదని అన్నారు మోదీ(PM Modi).
తెలంగాణ సీఎంగా తాను రాజీనామా చేస్తానని, తన తనయుడు కేటీఆర్ కు వారసత్వంగా సీఎం పదవి ఇస్తానంటూ ఆఫర్ ఇచ్చాడని , తన కొడుకును ఆశీర్వదించమంటూ తనను కోరాడని చెప్పారు ప్రధాన మంత్రి మోదీ.
కేటీఆర్ ఏమైనా యువ రాజానా ఇది రాజరికం కాదని, ప్రజాస్వామ్యం అని తాను కేసీఆర్ కు చెప్పానన్నారు. ఆ తర్వాత నుంచి నేటి దాకా తన కళ్లల్లోకి సీఎం కేసీఆర్ చూసే ధైర్యం చేయలేక పోతున్నారంటూ కుండ బద్దలు కొట్టారు. తనను కలిసే ధైర్యం లేదన్నారు. అందుకే ఏ ప్రోగ్రాంకు అటెండ్ కావడం లేదన్నారు మోదీ.
Also Read : Bandi Sanjay : కేసీఆర్ పై బండి కన్నెర్ర