Sachin Tendulkar : సచిన్ గ్లోబల్ అంబాసిడర్
నియమించిన ఐసీసీ
Sachin Tendulkar : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సచిన్ రమేష్ టెండూల్కర్ కు అరుదైన గౌరవం లభించింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో వన్డే వరల్డ్ కప్ 2023 నిర్వహించనుంది.
ఇప్పటికే బీసీసీఐకి సంబంధించి ఐసీసీ షెడ్యూల్ ప్రకటించింది. ప్రధానంగా పాకిస్తాన్ రానని మొదట చెప్పినా ఆ తర్వాత భారత్ తో ఆడేందుకు ఓకే చెప్పింది. తాజాగా ఐసీసీ సంచలన ప్రకటన చేసింది. సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) ను గ్లోబల్ అంబాసిడర్ గా నియమించినట్లు ప్రకటించింది.
Sachin Tendulkar As a Global Ambassador
వన్డే వరల్డ్ కప్ కు తనే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తారని ఐసీసీ తెలిపింది. ఇదిలా ఉండగా టీమిండియా తరపున 6 వన్డే వరల్డ్ కప్ లు ఆడాడు సచిన్ టెండూల్కర్. రేపటి నుంచి వన్డే వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ , కీవీస్ మధ్య వరల్డ్ కప్ ను ప్రారంభిస్తాడు మాస్టర్ బ్లాస్టర్.
ఇదిలా ఉండగా తనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినందుకు ఐసీసీకి థ్యాంక్స్ తెలిపారు సచిన్ రమేష్ టెండూల్కర్.
Also Read : Tirumala Navaratri : 15 నుంచి నవరాత్రి బ్రహ్మోత్సవాలు