Harish Rao : రేవంత్ జైలుకు వెళ్ల‌డం ఖాయం

ఆర్థిక‌, ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు

Harish Rao : తెలంగాణ – రాష్ట్ర ఆర్థిక‌, ఆరోగ్య శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆరోప‌ణ‌లు చేశారు. ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు.

Harish Rao Shocking Comments on Revanth Reddy

త‌న‌పై విచార‌ణ ఆపాలంటూ హైకోర్టును ఆశ్ర‌యించార‌ని అక్క‌డ నిరాశ ఎదురైంద‌న్నారు. చివ‌ర‌కు సుప్రీంకోర్టుకు వెళ్లార‌ని అక్క‌డ కూడా కోర్టు సీరియ‌స్ అయ్యింద‌ని, వెంట‌నే విచార‌ణ ఎదుర్కోవాల‌ని ఆదేశించింద‌న్నారు.

దీంతో ఓటుకు నోటు కేసులో కీల‌క పాత్ర పోషించిన ఎనుముల రేవంత్ రెడ్డి జీవితం జైలుకే ప‌రిమితం కాక త‌ప్ప‌ద‌న్నారు హ‌రీశ్ రావు(Harish Rao). త‌మ‌పై లేనిపోని అభాండాలు వేస్తూ, అన‌రాని మాట‌లు అంటూ , నోటికి వ‌చ్చిన‌ట్లు విమ‌ర్శ‌లు చేస్తున్న రేవంత్ రెడ్డికి కాల‌మే స‌రైన శిక్ష వేస్తుంద‌న్నారు మంత్రి.

ఆ కేసు విచార‌ణ జ‌ర‌గ‌డం ఖాయ‌మ‌ని, ఇక రేవంత్ రెడ్డికి జైలుకు వెళ్ల‌క త‌ప్ప‌ద‌ని జోష్యం చెప్పారు. ఇక‌నైనా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే బావుంటుంద‌ని సూచించారు మంత్రి హ‌రీశ్ రావు.

Also Read : Sachin Tendulkar : స‌చిన్ గ్లోబ‌ల్ అంబాసిడ‌ర్

Leave A Reply

Your Email Id will not be published!