RK Roja Selvamani : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి(RK Roja Selvamani) కంటతడి పెట్టారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి బండారు సత్య నారాయణ చౌదరి తనపట్ల అనుచితంగా కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇంత దిగజారి మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. అదే తన తల్లి, భార్య, చెల్లెలు, కూతురును ఇలాగే అంటారా అని ప్రశ్నించారు మంత్రి ఆర్కే రోజా సెల్వమణి.
RK Roja Selvamani Emotional
మీ ఇంట్లో మహిళల గురించి ఇలాగే మాట్లాడితే మీరు ఊరుకుంటారా అని నిలదీశారు. ప్రశ్నిస్తే తమ క్యారెక్టర్ మీద దాడి చేస్తారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరి ప్రైవేట్ జీవితం వారిదన్నారు. వారి గురించి అనుచితంగా మాట్లాడే హక్కు ఎవరికీ లేదన్నారు.
కనీసం సీనియర్ నాయకుడై ఉండి కూడా ఇలాంటి దిగజారుడు కామెంట్స్ చేయడం ఆయన విజ్ఞతకే వదిలి వేస్తున్నానని పేర్కొన్నారు. ఇవాళ తనకు బెయిల్ వచ్చిందని సంబరపడి పోతున్నారని , కానీ ఒక్కసారి తన మనస్సాక్షిని సరి చూసుకోవాలన్నారు.
తాను చంద్రబాబు నాయుడు చేసిన అవినీతి, అక్రమాలను ప్రశ్నించేనా తప్పా ఎక్కడా వ్యక్తిగత విమర్శలు చేయలేదన్నారు. రాజకీయాలు చేయడం అంటే వ్యక్తుల వ్యక్తిత్వాన్ని కించ పర్చడం కాదన్నారు ఆర్కే రోజా సెల్వమణి.
Also Read : BJP Senior Leaders : మోదీ సభకు సీనియర్లు డుమ్మా
