BJP Election Committee : బీజేపీ ఎన్నిక‌ల క‌మిటీ డిక్లేర్

BJP Election Committee : తెలంగాణ – తెలంగాణ‌లో త్వ‌ర‌లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆయా పార్టీల‌న్నీ రాబోయే ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ పెట్టాయి. తాజాగా భార‌తీయ జ‌న‌తా పార్టీ హైక‌మాండ్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నిక‌ల క‌మిటీల‌ను వెల్ల‌డించింది.

నిన్న‌టి దాకా తీవ్ర అసంతృప్తితో ఉన్న సీనియ‌ర్ల‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. పార్టీ ప‌రంగా మేనిఫెస్టో, ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ గా వివేక్ వెంక‌ట‌స్వామి, క‌న్వీన‌ర్ మ‌హేశ్వ‌ర్ రెడ్డి, జాయింట్ క‌న్వీన‌ర్ గా కొండా విశ్వేశ్వ‌ర్ రెడ్డిని నియ‌మించింది.

BJP Election Committee  Details

ప‌బ్లిక్ మీటింగ్స్ ఇంఛార్జిగా బీజేపీ(BJP) జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ కు అప్ప‌గించింది. స్క్రినింగ్ క‌మిటీ చైర్మ‌న్ గా కోమ‌టి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి, ఆందోళ‌న క‌మిటీ చైర్మ‌న్ గా సినీ న‌టి విజ‌య శాంతి, ఛార్జ్ షీట్ క‌మిటీ చైర్మ‌న్ గా ముర‌ళీధ‌ర్ రావు కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. దీంతో ప్ర‌ధాన మంత్రి మోదీ టూర్ త‌ర్వాత బీజేపీ దూకుడు పెంచింది.

Also Read : AP Skill Scam : ఏపీ స్కిల్ స్కాంలో బాబే కీల‌కం

Leave A Reply

Your Email Id will not be published!