Bandi Sanjay : కేసీఆర్ ఆచూకీ తెలిస్తే చెప్పండి

బీజేపీ మాజీ చీఫ్ బండి సంజ‌య్

Bandi Sanjay : హైద‌రాబాద్ – బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి బండి సంజ‌య్ కుమార్(Bandi Sanjay) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మ‌రోసారి బీఆర్ఎస్ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ప్ర‌త్యేకించి త‌న‌యుడు మంత్రి కేటీఆర్ పై నిప్పులు చెరిగారు. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

Bandi Sanjay Comments on KCR

గుర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. గ‌త కొన్ని రోజుల నుంచి సీఎం కేసీఆర్ క‌నిపించ‌డం లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం మంత్రి కేటీఆర్ అన్న అనుమానం క‌లుగుతోంద‌న్నారు. గ‌త 15 రోజుల నుంచి కేసీఆర్ ప‌త్తా లేకుండా పోయాడ‌ని, ఏడికి పోయిండో ఎవ‌రికీ తెలియ‌డం లేద‌న్నారు బండి సంజ‌య్ కుమార్.

త‌మ‌కు ఏదో అనుమానం క‌లుగుతోంద‌న్నారు. కేసీఆర్ ను కేటీఆర్ ఏమైనా చేసిండా , లేక ఏమైనా ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాడా అన్న‌ది తేలాల్సి ఉంద‌న్నారు . కేసీఆర్ త‌మ రాష్ట్రానికి చెందిన సీఎం అని. ఆయ‌న‌ను కాపాడు కోవాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు బండి సంజ‌య్ కుమార్.

కేసీఆర్ తో ప్రెస్ మీట్ పెట్టించాల‌ని అప్పుడే ఆయ‌న క్షేమంగా ఉన్న‌ట్టు తాము న‌మ్ముతామ‌ని చెప్పారు. ఇదిలా ఉండ‌గా బండి సంజ‌య్ చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

Also Read : Minister KTR : కేసీఆర్ ఖ‌లేజా ఉన్నోడు – కేటీఆర్

Leave A Reply

Your Email Id will not be published!