Harish Rao : సీఎం అల్పాహారం పిల్లలకు వరం
మంత్రులు హరీశ్ రావు, సబితా రెడ్డి
Harish Rao : తెలంగాణ – సీఎం కేసీఆర్ బ్రేక్ ఫాస్ట్ (అల్పాహారం) పిల్లలకు వరంగా మారనుందని స్పష్టం చేశారు మంత్రులు హరీశ్ రావు(Harish Rao), సబితా ఇంద్రా రెడ్డి. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మంత్రులు ఈ స్కీంను ప్రారంభించారు. ఈ సందర్భంగా పిల్లలతో కలిసి మంత్రులు టిఫిన్లు చేశారు. వారికి స్వయంగా తినిపించారు. ఉద్యమ కాలంలో తెలంగాణలో పిల్లలకు సరైన తిండి లేక పోవడాన్ని చూశారు సీఎం కేసీఆర్.
Harish Rao Comment
రాష్ట్రం ఏర్పాటై 10 ఏళ్లవుతోంది. ఇప్పటికే దేశంలో ఎక్కడా లేని రీతిలో గురుకులాలను ఏర్పాటు చేశారు సీఎం. ఇందులో భాగంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఆకలి తీర్చేందుకు గాను సీఎం అల్పాహారం పథకానికి శ్రీకారం చుట్టారు. అద్భుతమైన పథకమని కొనియాడారు మంత్రులు.
ఇదిలా ఉండగా తెలంగాణలోని 27 వేల 147 ప్రభుత్వ బడుల్లో 23 లక్షల మంది విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. ఇక బ్రేక్ ఫాస్ట్ స్కీంలో భాగంగా సోమవారం ఇడ్లి సాంబార్ లేదా గోధుమ రవ్వ ఉప్మా, చట్నీ ఇస్తారు. ఇక మంగళవారం పూరి, ఆలు కుర్మా లేదా టమాటా బాత్ రవ్వ, చట్నీ అందిస్తారు.
బుధవారం రోజు ఉప్మా, సాంబార్ లేదా కిచిడి, చట్టీ ఉంటుంది. గురువారం రోజు మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ లేదా పొంగగల్ , సాంబార్ ఇస్తారు. శుక్రవారం ఉగ్రాణి , పోహా, మిల్లెట్ ఇడ్లీ, చట్నీ , గోధుమ రవ్వ కిచిడీ, చట్నీ ఉంటుంది. శనివారం రోజు పొంగల్ , సాంబార్ లేదా కూరగాయల పొలావ్ , రైతా, ఆలు కుర్మ ఇస్తారని ప్రభుత్వం తెలిపింది.
Also Read : Akbaruddin Owaisi : రాహుల్..రేవంత్ కు ఓవైసీ సవాల్