Akbaruddin Owaisi : రాహుల్..రేవంత్ కు ఓవైసీ స‌వాల్

నేను ఆర్ఎస్ఎస్ కాద‌ని చెప్పు

Akbaruddin Owaisi : హైద‌రాబాద్ – రాష్ట్రంలో రాజ‌కీయాలు మ‌రింత వేడిని రాజేస్తున్నాయి. త్వ‌ర‌లోనే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో మాట‌లతో మంట‌లు రాజేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎంఐఎంపై చేసిన ఆరోప‌ణ‌ల‌ను తిప్పి కొట్టారు ఆపార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు , ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ.

Akbaruddin Owaisi Serious Comments

ఆయ‌న ఏఐసీసీ మాజీ చీఫ్ , వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌తో విరుచుకు ప‌డ్డారు. ఒక ర‌కంగా నిప్పులు చెరిగారు ఓవైసీ. త‌న తండ్రి, తాత‌, ముత్తాతలంతా ఈ దేశంలోనే పుట్టార‌ని, ఈ దేశం ప‌ట్ల‌, సంస్కృతి ప‌ట్ల గౌర‌వం క‌లిగి ఉన్నార‌ని ఆ విష‌యం తెలుసు కోకుండా అవాకులు చెవాకులు పేలితే ఎలా అని నిల‌దీశారు.

రాహుల్ గాంధీజీ మీ అమ్మ‌మ్మ ఎక్క‌డ పుట్టిందో నీకు తెలుసా అని ప్ర‌శ్నించారు. రేవంత్ రెడ్డికి స‌వాల్ విసిరారు. నీకు ద‌మ్ము ఉంటే, ఖ‌లేజా ఉంటే వెంట‌నే నా స‌వాల్ ను స్వీక‌రించాల‌ని అన్నారు అక్బ‌రుద్దీన్ ఓవైసీ(Akbaruddin Owaisi).

భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యం వ‌ద్ద‌కు వ‌చ్చి ఒట్టు వేసి చెప్పాల‌ని అన్నారు. తాను ఆర్ఎస్ఎస్ లో ప‌ని చేయ‌లేదని, ఆర్ఎస్ఎస్ వ్య‌తిరేకిని కానంటూ . ఆ ధైర్యం నీకు ఉందా అని ప్ర‌శ్నించారు అక్బరుద్దీన్ ఓవైసీ.

Also Read : Minister KTR Kaynestech : కేనెస్ టెక్ రూ. 2,800 కోట్లు ఇన్వెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!