K Atchannaidu : విరాళం ఇస్తే అవినీతి సొమ్మంటే ఎలా
ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు
K Atchannaidu : ఆంధ్ర ప్రదేశ్ – ఏపీ టీడీపీ చీఫ్ , మాజీ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు షాకింగ్ కామెంట్స్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి సంబంధించి రూ. 27 కోట్లు విరాళంగా ఇచ్చారని, ఇది తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఎలక్టోరల్ బాండ్స్ పేరుతో వేల కోట్ల రూపాయలు బీజేపీకి, కాంగ్రెస్ కు, ఇతర పార్టీలకు రావడం లేదా అని నిలదీశారు అచ్చెన్నాయుడు.
K Atchannaidu Comment
స్కిల్ పై నిందలు వేయడం అంటే యువత భవితపై దాడి చేయడమే అన్న పేరుతో టీడీపీ పుస్తకం రూపంలో తీసుకు వచ్చిందని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి వచ్చిన విరాళాలను అవినీతి సొమ్ముగా చూపించే ప్రయత్నం ఎంత వరకు సబబు అని ఆవేదన వ్యక్తం చేశారు.
అసలు స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏమిటి, ఎన్ని నిధులు వచ్చాయి. ఎలా ఖర్చు చేశామనే దానిపై పూర్తి వివరాలు ఇందులో పొందు పర్చడం జరిగిందన్నారు కింజారపు అచ్చెన్నాయుడు(K Atchannaidu). నాలుగు దశాబ్దాల పాటు తన రాజకీయ జీవితాన్ని ప్రజల కోసమే చంద్రబాబు నాయుడు అంకితం చేసిన గొప్ప నాయకుడని పేర్కొన్నారు.
ఆయనను కావాలని 28 రోజుల పాటు ఇంకా జైలులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారని , ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు టీడీపీ చీఫ్.
Also Read : Sunil Kanugolu : కనుగోలు పైనే అందరి కళ్లు