Hamas Attack : ఇజ్రాయెల్ – హమాస్ టెర్రరిస్టులు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడడంతో ఇజ్రాయెల్ తల్లడిల్లుతోంది. ఉగ్ర మూకల దాడులకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎక్కడ పడితే అక్కడ కాల్పులకు తెగ బడుతున్నారు. రాకెట్లతో అటాక్ చేయడంతో భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం ఏర్పడింది.
Hamas Attack Viral in Israel
ఈ భయానక దృశ్యాలు కంట తడి పెట్టిస్తున్నాయి. గుండెల్ని పిండేస్తున్నాయి. ఉగ్రవాదులు చొరబడి విధ్వంసాలకు పాల్పడుతున్నారు. రోడ్లపైనే కాల్పులు జరుపుతున్నారు. మహిళలను వివస్త్రలను చేసి ఈడ్చుకుంటూ వెళుతున్నారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతే కాదు టెర్రరిస్టులు(Hamas Attack) పోలీసులను పొట్టన పెట్టుకున్నా వదిలి పెట్టడం లేదు. విచక్షణా రహితంగా కాల్పులకు పాల్పడుతూ అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉండగా ఇజ్రాయెల్ లో యుద్ద బీభత్సం కొనసాగుతోంది. దీంతో భారత దేశ ప్రభుత్వం స్పందించింది. ఆ దేశంలోని భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని కోరారు.
ఏదైనా ఎమర్జెన్సీ అయితే +97235226748కు ఫోన్ లేదా cons1.telaviv@mea.gov.inకు మెసెజ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read : Meena Slams : బండారు కామెంట్స్ మీనా సీరియస్