Minister KTR : నెట్టింట్లో ‘రేటెంత రెడ్డి’ వైరల్
ఐటీ మంత్రి కేటీఆర్ కామెంట్స్
Minister KTR : హైదరాబాద్ – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. రేవంత్ రెడ్డి పేరును ఆ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మార్చేశారంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ రేటు ఎంత రెడ్డి అంటూ ప్రశ్నిస్తున్నారని , ఇంతలా దిగజారి పోయిన సదరు నేతను ఎందుకు టీపీసీసీ చీఫ్‌గా కొనసాగిస్తున్నారో హైకమాండ్ కు తెలియాలని అన్నారు కేటీఆర్.
Minister KTR Slams Revanth Reddy
త్వరలో తెలంగాణలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం టీం వచ్చి వెళ్లి పోయింది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ రక్తి కట్టిస్తున్నారు.
తాజాగా మంత్రి కేటీఆర్(Minister KTR) తాను ఎక్కడికి వెళ్లినా, ఏ సభలోనైనా రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని నిప్పులు చెరుగుతున్నారు. రేవంత్ రెడ్డి కాదు రేటు ఎంత రెడ్డి అని పాపులర్ అయ్యాడంటూ మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ ఖర్మ కాలి టీపీసీసీ చీఫ్ అయ్యాడంటూ ఫైర్ అయ్యారు. ఏ పార్టీ తమ పార్టీ దరి దాపుల్లో లేదన్నారు. రేవంత్ రెడ్డి ఎక్కువగా ఊహించు కుంటున్నాడని సెటైర్ వేశారు కేటీఆర్.
Also Read : Hyderabad City : భాగ్య నగరం విశ్వ నగరం