Telangana Election 2023 : నవంబర్ 30న తెలంగాణలో పోలింగ్
డిసెంబర్ 3న ఫలితాలు ప్రకటన
Telangana Election 2023 : న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నగారా మోగించింది. దేశంలోని 5 రాష్ట్రాలలో ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. సోమవారం న్యూఢిల్లీలో సీఈసీ మీడియాతో మాట్లాడారు.
Telangana Election 2023 Schedule
తెలంగాణతో పాటు రాజస్థాన్ , మధ్య ప్రదేశ్ , మిజోరం, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతాయని జనవరితో ముగుస్తాయని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే సరికి నవంబర్ 30న పోలింగ్ జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 3న ఎన్నికల రిజల్ట్స్ ప్రకటిస్తామని వెల్లడించారు.
దీంతో ఇవాల్టీ నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ప్రకటించారు. తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు , ఛత్తీస్ గఢ్ లో 90 , మిజోరాంలో 40, రాజస్థాన్ లో 200 , మధ్య ప్రదేశ్ లో 230 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మొత్తం 679 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతాయని పేర్కొన్నారు సీఈసీ(CEC) రాజీవ్ కుమార్.
ఇదిలా ఉండగా మిజోరాం అసెంబ్లీ పదవీ కాలం డిసెంబర్ 17న ముగుస్తుందని , ఛత్తీస్ గఢ్ స్టేట్ జనవరి 3న , మధ్య ప్రదేశ్ జనవరి 8న, రాజస్థాన్ జనవరి 14న , తెలంగాణ అసెంబ్లీ పదవీ కాలం జనవరి 18తో ముగుస్తుందన్నారు.
ఇక ఐదు రాష్ట్రాలకు సంబంధించి 8.2 కోట్ల మంది పురుష ఓటర్లు ఉండగా మహిళా ఓటర్లు 7.8 కోట్ల మంది ఉన్నారని చెప్పారు సీఈసీ .
Also Read : CEC Announce : 5 రాష్ట్రాలు 1.77 లక్షల పోలింగ్ కేంద్రాలు
