Nara Brahmani : బాబు ఆరోగ్యంపై బ్రాహ్మ‌ణి ఆందోళ‌న

5 కేజీలు త‌గ్గార‌ని కోడ‌లు ఆవేద‌న

Nara Brahmani : రాజ‌మండ్రి – ఏపీ స్కిల్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై ప్ర‌స్తుతం రిమాండ్ ఖైదీగా రాజ‌మండ్రి సెంట్రల్ జైలులో ఊచ‌లు లెక్క బెడుతున్నారు మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న‌ను కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే క‌లుస్తున్నారు.

Nara Brahmani Words about Chandrababu

మొన్న‌టికి మొన్న ప‌య్యావుల కేశ‌వ్, అచ్చెన్నాయుడు క‌లిశారు. బాబును చూస్తే జాలేస్తోంద‌ని పేర్కొన్నారు. ఆయ‌నలో ప‌ట్టుదల ఏ మాత్రం త‌గ్గ‌లేద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా శుక్ర‌వారం చంద్ర‌బాబు నాయుడు కోడ‌లు, బాల‌కృష్ణ కూతురు నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మ‌ణి(Nara Brahmani) మీడియాతో మాట్లాడారు.

త‌న మామకు ఏ పాపం తెలియ‌ద‌న్నారు. ఆయ‌న ఎవ‌రి వ‌ద్ద నుంచి ఒక్క పైసా కూడా తీసుకోలేద‌న్నారు. ప్ర‌భుత్వం కావాల‌ని క‌క్ష సాధింపుతో చంద్ర‌బాబు నాయుడిని జైలులో వేసింద‌ని ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి ఆధారాలు ఇవ్వ‌లేద‌న్నారు నారా బ్ర‌హ్మాణి.

ఇప్ప‌టికే అరెస్ట్ అయ్యాక త‌న మామ 5 కేజీల బ‌రువు త‌గ్గార‌ని, దీని వ‌ల్ల వ‌య‌స్సు రీత్యా కిడ్నీల‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వెంట‌నే ఆయ‌న‌కు మెరుగైన చికిత్స అందించాల‌ని ప్ర‌భుత్వాన్ని కోరారు.

Also Read : Ponnala Lakshmaiah : పొన్నాల కాంగ్రెస్ కు రాజీనామా

Leave A Reply

Your Email Id will not be published!