Undavalli Arun Kumar : ఉండవల్లి సంచలన కామెంట్స్
చంద్రబాబు పీఏ కీలక పాత్ర
Undavalli Arun Kumar : అమరావతి – కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. ఏపీ స్కిల్ డెవపల్మెంట్ కార్పొరేషన్ స్కాం కేసులో అడ్డంగా బుక్కయ్యారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. ఏసీబీ కోర్టు అక్టోబర్ 19 వరకు రిమాండ్ విధించింది. ఇదే సమయంలో ఏపీ సీఐడీ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఏకంగా మూడు కేసులలో ఇరికించింది.
Undavalli Arun Kumar Comments Viral
ఏపీ స్కిల్ స్కాంతో పాటు ఫైబర్ నెట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎల్మైన్మెంట్ కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడిగా ఏపీ సీఐడీ పేర్కొంది. దీంతో చంద్రబాబు నాయుడుకు బెయిల్ రావడం ఇబ్బందిగా మారింది. ఈ మొత్తం కేసుల వ్యవహారంపై ఉండవల్లి అరుణ్ కుమార్(Undavalli Arun Kumar) తీవ్ర స్థాయిలో స్పందించారు.
స్కిల్ స్కాం కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలా కోరడం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఈ స్కాంలో డబ్బులు ముట్టినట్లు ఆధారాలు లేవన్నారు. కానీ ఇదే సమయంలో తను సీఎంగా ఉన్న సమయంలో పీఏ అకౌంట్లో డబ్బులు జమ అయ్యాయని, ఇది కాదనలేని వాస్తవం అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.
17ఎ వర్తిస్తే జగన్ పై కేసులే ఉండవన్నారు. రాజమండ్రి సెంట్రల్ జైలు బాగుంటుందన్నారు.
Also Read : Kanakadurga Temple : శరన్నవరాత్రి ఉత్సవాలు షురూ