BRS Manifesto Comment : ఆకట్టుకోని గులాబీ మేనిఫెస్టో
జాబ్స్..నిరుద్యోగుల ఊసెత్తని బాస్
BRS Manifesto Comment : నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల ఆశలపై నీళ్లు చల్లారు గులాబీ దళపతి కేసీఆర్. ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసిన నిరుద్యోగులకు, కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిరాశే మిగిలింది. ఆసరా పెన్షన్లు, రైతు బంధుకు సంబంధించి డబ్బులు పెంచుతున్నట్లు ప్రకటించారు. మహిళల కోసం ప్రత్యేకంగా స్కీం తెస్తున్నట్లు తెలిపారు. ఆరోగ్య, వైద్య రంగానికి ప్రయారిటీ ఇచ్చారు. రెడ్డి సామాజిక వర్గానికి తీపి కబురు చెప్పారు. వారిలో పేద పిల్లలు చదువు కునేందుకు గురుకులాలు తీసుకు వస్తున్నట్లు తెలిపారు. ప్రగతి భవన్ లో గులాబీ బాస్ బీఆర్ఎస్(BRS) మేనిఫెస్టోను విడుదల చేశారు. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే టీఎస్పీఎస్సీ పనితీరుపై సవాలక్ష అనుమానాలు ఉన్నాయి. ఇప్పటికే గ్రూప్ -1 కొండెక్కింది, గ్రూప్ -2 వాయిదా పడింది. ఇక డీఎస్సీ ఉంటుందో లేదో తెలియదు. జాబ్స్ క్యాలెండర్ గురించి ప్రస్తావించక పోవడం విస్తు పోయేలా చేసింది.
BRS Manifesto Comment Viral
అర్హులైన పేద మహిళలకు నెల నెలా పెన్షన్ అందజేస్తామన్నారు. పేద మహిళలకు రూ. 400 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. తాము పవర్ లోకి రావడం ఖాయమని, ఆ వెంటనే ప్రతి ఒక్కరికీ అర్హులైన కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తామన్నారు కేసీఆర్. బీపీఎల్ కుటుంబాలకు గుడ్ న్యూస్ చెప్పారు. భారతీయ జీవిత బీమా సంస్థ ద్వారా రూ. 5 లక్షల రూపాయల జీవిత బీమా ఇస్తామని ప్రకటించారు. ఆసరా పెన్షన్లను 5 వేలు పెంచుతున్నట్లు పేర్కొన్నారు. వీటిని దశల వారీగా పెంచుతామని వెంటనే ఇవ్వబోమన్నారు. ప్రస్తుతం ఇస్తున్న రైతు బంధు సాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. మొదటగా రూ. 12 వేలు , ఆ తర్వాత రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్.
అర్హులైన పేద మహిళకు ప్రతి నెలా రూ. 3 వేలు ఇస్తామన్నారు. ఆరోగ్య శ్రీ కింద గరిష్టంగా రూ. 15 లక్షలకు పెంచుతున్నట్లు స్పష్టం చేశారు గులాబీ బాస్. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎలాంటి ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇండ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించారు. మహిళా సంఘాలకు స్వంత భవనాలు సమకూరుస్తామని హామీ ఇచ్చారు. మరో వైపు అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తి వేస్తున్నట్లు స్పష్టం చేశారు. అనాథల పిల్లల కోసం ప్రత్యేకంగా పాలసీని తీసుకు వస్తామని వెల్లడించారు సీఎం కేసీఆర్. మొత్తంగా నిరుద్యోగుల ఊసే లేకుండానే బీఆర్ఎస్ మేని ఫెస్టో ప్రకటించడాన్ని నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా రైతులు, మహిళలను టార్గెట్ చేసుకుని దీనిని రూపొందించినట్లవుతోంది.
Also Read : Congress Party : బీసీలకు 12 సీట్లు జనరల్ 26 సీట్లు