Revanth Reddy : బీఆర్ఎస్ మేనిఫెస్టో బక్వాస్
కేసీఆర్ కు సవాల్ విసిరిన రేవంత్
Revanth Reddy : హైదరాబాద్ – టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ బాస్ , తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం పనై పోయిందన్నారు. ఆయనకు ఫామ్ హౌస్ కు పరిమితం కావడం ఖాయమని జోష్యం చెప్పారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో పూర్తిగా బక్వాస్ అని పేర్కొన్నారు. తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను కాపీ కొట్టిందని ఆరోపించారు.
Revanth Reddy Slams BRS Party
గతంలో ప్రకటించిన వాటికే దిక్కు లేదని ఇప్పుడు ఏం చేస్తారంటూ ప్రశ్నించారు. మరోసారి ప్రజలను బురిడీ కొట్టించేందుకు ప్రయత్నం చేస్తున్నాడని ప్రస్తుతం నాలుగున్నర కోట్ల ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
అదిగో ఇదిగో అంటూ ఊరిస్తూ బిల్లా రంగాలైన కేటీఆర్, హరీశ్ రావు ఊదరగొట్టారని చివరకు బీఆర్ఎస్ మేనిఫెస్టో తుస్సుమని అనిపించేలా ఉందని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి(Revanth Reddy). ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలని అన్నారు.
మద్యం, నగదు పంపిణీ చేయకుండా ఎన్నికల్లో పోరాడే దమ్ముందా అని ప్రశ్నించారు. అమర వీరుల సాక్షిగా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు టీపీసీసీ చీఫ్. అక్టోబర్ 17న మధ్యాహ్నం రావాలని పిలుపునిచ్చారు. ఉద్యోగులకు, 55 లక్షల మంది ఆసరా పెన్షన్ దారులకు నవంబర్ 1న ఇవ్వగలరా అని మండిపడ్డారు.
Also Read : BRS Manifesto Comment : ఆకట్టుకోని గులాబీ మేనిఫెస్టో