Ambati Ram Babu : బాబు సింప‌తీ గేమ్స్ చెల్ల‌వు – అంబ‌టి

బాబుకు ముందు నుంచే బొల్లి వ్యాధి

Ambati Ram Babu : గుంటూరు – ఏపీ నీటి పారుద‌ల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు(Ambati Ram Babu) నిప్పులు చెరిగారు. ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆరోగ్యం గురించి కుటుంబీకులు అన్నీ అబ‌ద్దాలు చెబుతున్నారంటూ ఆరోపించారు. సింప‌తీ గేమ్స్ మొద‌లు పెట్టార‌ని ఇది వ‌ర్క‌వుట్ కాద‌ని స్ప‌ష్టం చేశారు అంబ‌టి రాంబాబు.

Ambati Ram Babu Comments on Chandrababu

చంద్ర‌బాబుకు ఎప్ప‌టి నుంచో బొల్లి వ్యాధి ఉంద‌న్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు వైద్యులు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నార‌ని , ఆయ‌న నీతి మంతుడే అయితే ఎప్పుడో బెయిల్ వ‌చ్చేద‌న్నారు. కానీ ఏపీ సీఐడీ చంద్ర‌బాబుకు సంబంధించి మూడు కేసులు న‌మోదు చేసింద‌న్నారు.

ఇందులో ఏపీ స్కిల్ స్కాంతో పాటు ఫైబ‌ర్ నెట్, అమ‌రావ‌తి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ కుంభ‌కోణం కూడా ఉంద‌న్నారు. త‌న 45 ఏళ్ల రాజ‌కీయ జీవితంలో కేవ‌లం దోచు కునేందుకు, దాచుకునేందుకు మాత్ర‌మే ప‌ని చేశాడ‌ని ఆరోపించారు అంబ‌టి రాంబాబు.

రాష్ట్రానికి, ప్ర‌జ‌ల‌కు ఆయ‌న చేసింది ఏమీ లేద‌న్నారు. బ‌హుశా త‌న శేష జీవితం అంతా చెర‌సాల లోనే గ‌డపాల్సి వ‌స్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. చిల్ల రాజ‌కీయాలు మానుకుంటే టీడీపీకి మంచిద‌న్నారు. ఇక ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఏ పార్టీకి చీఫ్ గా ఉన్నారో చెబితే బావుంటుంద‌న్నారు.

Also Read : Revanth Reddy : బీఆర్ఎస్ మేనిఫెస్టో బ‌క్వాస్

Leave A Reply

Your Email Id will not be published!