TTD Chairman Bhumana : వేదం జీవ‌న నాదం – టీటీడీ చైర్మ‌న్

ధ‌ర్మ బ‌ద్ద‌మైన జీవితానికి మార్గం

TTD Chairman Bhumana : తిరుమ‌ల – వేదాల వ‌ల్ల ఎంతో ఉప‌యోగం ఉంద‌న్నారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం(TTD) చైర్మ‌న్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి. మానవ జాతి ధ‌ర్మ బ‌ద్ద‌మైన జీవితం గ‌డిపేందుకు ప్ర‌బోధించే ప‌విత్ర‌మైన గ్రంథాలు ఈ వేదాలు అని అన్నారు.

నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమలలోని నాద నీరాజన వేదిక‌పై శ్రీ వేంకటేశ్వర ఉన్నత వేద అధ్యయన సంస్థ ఆధ్వర్యంలో శ్రీనివాస వేద విద్వత్ సదస్సు చేప‌ట్టారు. ఈ సంద‌ర్బంగా ఛైర్మ‌న్‌ మాట్లాడారు.

TTD Chairman Bhumana Comment

భార‌త‌దేశంలో వేల సంవ‌త్స‌రాల నుండి వేద విజ్ఞానం ప‌రిఢ‌విల్లుతోంద‌ని అన్నారు. వేద ప్రామాణికంగా న‌డుచుకుంటే నైతిక విలువ‌ల‌తో కూడిన జీవ‌నం అల‌వ‌డుతుంద‌ని తెలిపారు. వేదాలు ఏ ఒక వర్గానికి మాత్ర‌మే పరిమితం కావాని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, మాన‌వీయ విలువ‌ల‌తో సంపన్నమైన జీవితాన్ని గడపడానికి ఉపయోగ ప‌డుతుంద‌న్నారు. స‌నాత‌న హైంద‌వ‌ ధర్మంలో బోధించిన సిద్ధాంతాలను అనుసరించాల‌ని భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి సూచించారు.

వేదం అజ్ఞానంలో ఉండే మాన‌వుడిని విజ్ఞానం వైపు న‌డిపించ‌డంతో పాటు సంస్కారం అందించి, స‌ర్వోన్న‌తుడైన మ‌హోన్న‌త వ్య‌క్తిగా తీర్చిదిద్దుతుంద‌ని అన్నారు బ్ర‌హ్మ‌శ్రీ శ్రీ‌రామ శ‌ర్మ‌.

Also Read : Ambati Ram Babu : బాబు సింప‌తీ గేమ్స్ చెల్ల‌వు – అంబ‌టి

Leave A Reply

Your Email Id will not be published!