Jitta Balakrishna Reddy : హస్తానికి జిట్టా గుడ్ బై
టికెట్ రాక పోవడంతో రిజైన్
Jitta Balakrishna Reddy : హైదరాబాద్ – తెలంగాణ ఉద్యమంలో కీలకమైన నాయకుడిగా గుర్తింపు పొందిన జిట్టా బాలకృష్ణా రెడ్డి ఉన్నట్టుండి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకు టికెట్ వస్తుందని ఆశించారు. కానీ రాక పోవడంతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Jitta Balakrishna Reddy Ticket Issues Viral
ఆయన ఇటీవలే భారతీయ జనతా పార్టీలో చేరారు. పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. ఆయనతో పాటు మహబూబ్ నగర్ మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సైతం కాషాయాన్ని వీడారు. ఇటీవలే ఇద్దరూ కలిసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
ఈ ఇద్దరు నేతలు ఎమ్మెల్యే టికెట్లను ఆశించారు. ఇదే హామీపై వారు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా ఏఐసీసీ ఎన్నికల స్క్రినింగ్ కమిటీ సంచలన ప్రకటన చేసింది. 119 సీట్లకు గాను 55 సీట్లకు సంబంధించి అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను వెల్లడించింది.
ఈ లిస్టులో ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో జంప్ అయిన 20 మంది నేతలకు టికెట్లు దక్కాయి. ఇందులో 17 మంది రెడ్లకు దక్కడం విశేషం. ఉద్యమకారుడిగా జిట్టా బాలకృష్ణా రెడ్డికి మంచి పేరుంది. ఈ తరుణంలో తను కేసీఆర్(KCR) సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీలో జంప్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్నట్లు సమాచారం.
Also Read : Narayana Case : నారాయణ కేసుపై విచారణ