AP CM YS Jagan : ఐటీ హ‌బ్ గా విశాఖ – జ‌గ‌న్

డిసెంబ‌ర్ లో కొలువు తీరుతా

AP CM YS Jagan : విశాఖ‌ప‌ట్నం – ఏపీ సీఎం జ‌గ‌న్ మోహన్ రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త్వ‌ర‌లోనే విశాఖ‌కు తాను షిఫ్ట్ అవుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. సోమవారం ప్ర‌ముఖ దిగ్గ‌జ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ ప్ర‌ధాన కార్యాల‌యాన్ని విశాఖ‌లో ఏర్పాటు చేసింది. దీనిని చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ తో క‌లిసి ఏపీ సీఎం ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌సంగించారు.

AP CM YS Jagan Comment

త‌మ ప్ర‌భుత్వానికి సంబంధించిన కీల‌క కార్యాల‌యాల‌ను , సీఎంఓ ఆఫీసు కూడా త్వ‌ర‌లోనే విశాఖ ప‌ట్ట‌ణానికి మారుతుంద‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ సీఎం. వ‌చ్చే డిసెంబ‌ర్ నెలాఖ‌రు లోగా తాను ఇక్క‌డికి వ‌చ్చేస్తాన‌ని అంత వ‌ర‌కు తాడేప‌ల్లి గూడెం నుంచి పాల‌న కొన‌సాగుతుంద‌ని చెప్పారు.

ప‌రిపాల‌నా విభాగంగా అంతా ఇక్క‌డికే వ‌స్తుంద‌న్నారు. గ‌తంలో తాను చెప్పిన విధంగానే పాల‌నా ప‌రంగా త్వ‌రిత‌గ‌తిన చ‌ర్య‌లు తీసుకునేందుకు వీలుగా ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(AP CM YS Jagan). దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు పేరు పొందిన హైద్రాబాద్ , చెన్నై , బెంగ‌ళూరు త‌ర‌హాలో విశాఖ న‌గ‌రం కూడా ఐటీ హ‌బ్ గా మార బోతోంద‌ని జోష్యం చెప్పారు. ఆ న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌న్నారు సీఎం.

ఇప్ప‌టికే విశాఖ‌లో 8 యూనివ‌ర్శిటీలు, 4 మెడికల్ కాలేజీలు, 14 ఇంజినీరింగ్, 12 డిగ్రీ కాలేజీలు ఉన్నాయ‌ని తెలిపారు. అంతే కాకుండా ప్ర‌తి సంవ‌త్స‌రం 15 వేల ఇంజినీర్లను వైజాగ్ అందిస్తోంద‌ని స్ప‌ష్టం చేశారు.

Also Read : Jitta Balakrishna Reddy : హ‌స్తానికి జిట్టా గుడ్ బై

Leave A Reply

Your Email Id will not be published!