Kasani Gnaneshwar : తెలంగాణ ఎన్నికల బరిలో టీడీపీ
టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్
Kasani Gnaneshwar : హైదరాబాద్ – తెలంగాణ టీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సంచలన ప్రకటన చేశారు. పార్టీ పరంగా తాము నిర్ణయం తీసుకున్నామని, వచ్చే నెల నవంబర్ లో జరిగే శాసన సభ ఎన్నికల్లో తమ పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. సోమవారం కాసాని జ్ఞానేశ్వర్ మీడియాతో మాట్లాడారు.
Kasani Gnaneshwar Confirms to Contest TDP
ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీకి బలమైన నాయకత్వం, కేడర్ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ పార్టీకి చిరునామా అంటూ లేకుండా పోయింది. గెలిచిన ఒకరిద్దరు కూడా బీఆర్ఎస్ లోకి జంప్ అయ్యారు. తాజాగా ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే దయాకర్ రెడ్డి భార్య కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంది.
ఇదిలా ఉండగా ప్రస్తుతం టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి లా తయారైంది. ఆయన బయటకు వస్తారో లేదోనన్న ఆందోళన నెలకొంది. ఇప్పటికే ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రిమాండ్ ఖైదీగా ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నారు.
ఈనెల 19 వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ ఒక్క కేసుతో పాటు మరికొన్ని కేసులు చంద్రబాబుపై నమోదు చేసింది ఏపీ సీఐడీ. దీంతో పార్టీ పోటీ చేస్తుందా లేదా అన్న మీమాంసకు తెర దించే ప్రయత్నం చేశారు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్(Kasani Gnaneshwar). రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గం భారీ ఎత్తున ఉంది. వీరి ఓటు బ్యాంకు చాలా నియోజకవర్గాలలో ప్రభావం చూపించే ఛాన్స్ ఉంది.
Also Read : Minister KTR : టీడీపీ ఆందోళనలు ఒప్పుకోం