Akunuri Murali : అబద్దాల నటరత్న కేటీఆర్
మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి
Akunuri Murali : హైదరాబాద్ – మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు. ఇంకెన్ని ఏళ్లు అబద్దాలు చెబుతూ, మోసం చేస్తూ బతుకుతారంటూ కల్వకుంట్ల ఫ్యామిలీని ఏకి పారేశారు. తెలంగాణ పేరుతో నాలుగున్నర కోట్ల ప్రజానీకాన్ని నిట్ట నిలువునా దోపిడీకి పాల్పడిన మీకు పాలించే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు.
Akunuri Murali Slams KTR
వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు ఎన్ని అబద్దాలు అయినా చెబుతున్నారని, కానీ జనం నమ్మే స్థితిలో లేరన్నారు. నిరుద్యోగం ఓ వైపు ఆశనిపాతం లాగా తయారైందని ఆవేదన చెందారు. తనకు జాబ్ రాలేదన్న బాధతో ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడిందని ఆ బాధ కూడా కేటీఆర్ కు లేకుండా పోయిందని మండిపడ్డారు ఆకునూరి మురళి(Akunuri Murali).
బాధితురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరాల్సిన మంత్రి ఆమెను అవమాన పర్చడం ద్వారా తన స్థాయి ఏమిటో చెప్పకనే చెప్పాడంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో 40 లక్షల నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లాడంటూ ధ్వజమెత్తారు. జరగబోయే శాసన సభ ఎన్నికల్లో కల్వకుంట్ల కుటుంబాన్ని బొంద పెట్టేందుకు సిద్దం కావాలని పిలుపునిచ్చాచరు ఆకునూరి మురళి.
Also Read : Hyd Police Checking : భారీగా నగదు..ఆభరణాలు స్వాధీనం