Komatireddy Venkat Reddy : బాబుకు మ‌ద్ద‌తిస్తే త‌ప్పేంటి

ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి

Komatireddy Venkat Reddy : హైద‌రాబాద్ – కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, భువ‌నగిరి ఎంపీ కోమ‌టి రెడ్డి వెంక‌ట్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. విచిత్రంగా ఆయ‌న టీడీపీ జాతీయ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుకు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు.

Komatireddy Venkat Reddy Support Chandrababu

ఇప్ప‌టికే ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కై రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ స్కాంతో పాటు ఫైబ‌ర్ నెట్ , అమ‌రావతి రింగ్ రోడ్డు ఎన్ లైన్మెంట్ స్కాం కేసులో ప్ర‌ధానమైన వ్య‌క్తిగా ఏపీ సీఐడీ పేర్కొంది. ఇప్ప‌టికే ఏసీబీ కోర్టు 19 వ‌ర‌కు రిమాండ్ విధించింది.

త‌న‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతూ దాఖ‌లు చేసిన పిటిష‌న్ ను హైకోర్టు తోసి పుచ్చింది. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన కోమటిరెడ్డి(Komatireddy Venkat Reddy) చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు తెల‌ప‌డం విస్తు పోయేలా చేసింది. తెలంగాణ ఏమైనా పాకిస్తాన్ లో ఉందా అని ప్ర‌శ్నించారు.

హైద‌రాబాద్ ఏమైనా కేసీఆర్ , కేటీఆర్ జాగీరా అని నిల‌దీశారు. చంద్ర‌బాబు నాయుడు వ‌ల్ల‌నే ఐటీ అభివృద్ది జ‌రిగింద‌న్నారు. ఆయ‌న వ‌ల్ల‌నే ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు వ‌చ్చాయ‌ని స్ప‌ష్టం చేశారు. క‌మ్మ వారే కాదు అన్ని కులాల వాళ్లు బాబు కోసం ఆందోళ‌న చేస్తున్నార‌ని ఆరోపించారు. ఇక్క‌డ అంద‌రికీ నిర‌స‌న తెలిపే హ‌క్కు ఉంటుంద‌న్నారు.

Also Read : Congress Shock : బీఆర్ఎస్ పేప‌ర్..ఛాన‌ల్ కు నో ఎంట్రీ

Leave A Reply

Your Email Id will not be published!