Congress Seniors : కాంగ్రెస్ పార్టీపై సీనియర్ల గుస్సా
తొలి జాబితాలో నో ఛాన్స్
Congress Seniors : హైదరాబాద్ – కాంగ్రెస్(Congress) పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, తొలి నుంచీ పార్టీ కోసం కట్టుబడి పని చేసిన వారికి బిగ్ షాక్ తగిలింది. ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ తో పాటు మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎంపీలు సున్నం రాజయ్య, సురేష్ షెట్కార్ లకు ఊహించని రీతిలో పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యేల తొలి జాబితాలో చోటు దక్కలేదు. మొత్తం 119 సీట్లకు గాను 55 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసింది.
Congress Seniors Issues Viral
తెలంగాణ ఉద్యమంలో కీలకమైన పాత్ర పోషించారు వీరంతా. కేసీఆర్ గాలం వేసినా చిక్క లేదు. పార్టీ జెండా కోసం పని చేశారు. నిత్యం బీఆర్ఎస్ సర్కార్ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వచ్చారు. తొలి లిస్టులో తమకు చోటు కల్పించక పోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. ఈ మేరకు మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ నివాసంలో వీరంతా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర స్థాయిలో చర్చించారు.
మొదటి జాబితాలో తాము ఆశిస్తున్న సీట్లను కేటాయించక పోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎంపీలు, మాజీ కేంద్ర మంత్రి. ఈసారి నిజామాబాద్ కాకుండా ఎల్బీ నగర్ సీటును కోరుతున్నారు మధు యాష్కి గౌడ్. మొత్తంగా రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Ketham Reddy Vinod Reddy : నాదెండ్ల టీడీపీ కోవర్టు