Chandra Babu Case : చంద్రబాబు కేసు విచారణ వాయిదా
ఏపీ స్కిల్ స్కాం కేసులో నిందితుడు
Chandra Babu Case : అమరావతి – టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు బిగ్ షాక్ తగిలింది. ఏపీ స్కిల్ స్కాం కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఏపీ ఏసీబీ కోర్టు ఆయనకు 19 వరకు రిమాండ్ విధించింది.
Chandra Babu Case Updates
దీనిని సవాల్ చేస్తూ తనకు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు పిటిషన్ ను తోసి పుచ్చింది. ఇదే సమయంలో మంగళవారం స్కిల్ స్కాం కేసుకు సంబంధించి విచారణ చేపట్టింది. 19 వరకు వాయిదా వేస్తున్నట్లు తీర్పు చెప్పింది.
ఇదిలా ఉండగా చంద్రబాబు నాయుడుపై(Chandra Babu) ఏపీ సీఐడీ కీలక ఆరోపణలు చేసింది. పక్కా ఆధారాలతో నివేదిక కోర్టుకు సమర్పించింది. ఇదే సమయంలో ఏపీ స్కిల్ స్కాంతో పాటు ఫైబర్ నెట్ స్కాం, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు ఎలైన్మెంట్ కేసులో కూడా కీలక పాత్ర ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది.
ఇదే సమయంలో నారా చంద్రబాబు నాయుడుతో పాటు మాజీ మంత్రులు కొనకళ్ల నారాయణ, నారా లోకేష్ బాబు ను కూడా చేర్చింది ఏపీ సీఐడీ.
Also Read : CJI Same Sex : సీజేఐ సంచలన తీర్పు