RK Roja Selvamani : జగనన్న సురక్ష పేదలకు రక్ష
మంత్రి ఆర్కే రోజా సెల్వమణి
RK Roja Selvamani : ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొత్తగా తీసుకు వచ్చిన జగనన్న సురక్ష స్కీం వరంగా మారిందన్నారు.
దేశంలో ఏ సీఎంకు రాని ఆలోచన ఒక్క జగన్ రెడ్డికి మాత్రమే వచ్చిందన్నారు ఆర్కే రోజా సెల్వమణి(RK Roja Selvamani). పేదలకు ఎంతో అండగా నిలుస్తోందన్నారు. దీని వల్ల మేలు చేకూరుతోందని పేర్కొన్నారు.
RK Roja Selvamani Comment
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు సీఎం చేసిన ప్రతిజ్ఞను నిజం చేసేందుకు వైద్య ఆరోగ్య సిబ్బంది ఇల్లిల్లు తిరుగుతూ ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు ఆర్కే రోజా సెల్వమణి.
మంగళవారం నిండ్ర మండలం నెట్టేరి సచివాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏపీ మంత్రి పాల్గొని ప్రసంగించారు. మొత్తం 460 మందిని ఎంపిక చేశారని వీరిలో 350 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు.
కంటి వెలుగు పథకం పరీక్షలు చేపట్టారు. మొత్తం 88 మందికి కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు పథకం కింద రూ. 5 లక్షల బీమా స్కీంలను 71 మందికి అందజేశారు.
దేశంలోనే ఏపీ అన్ని రంగాలలో ఆదర్శ ప్రాయంగా నిలిచిందని స్పష్టం చేశారు ఏపీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి.
Also Read : Kodi Katti Case : కోడి కత్తి కేసు విచారణ వాయిదా