G Kishan Reddy : ప్రవల్లికది ప్రభుత్వ హత్య
బీజేపీ చీఫ్ జి.కిషన్ రెడ్డి
G Kishan Reddy : హైదరాబాద్ – ప్రవల్లిక ఆత్మహత్య వ్యవహారం తెలంగాణ రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ప్రజా, విద్యార్థి సంఘాలతో పాటు ప్రజాస్వామిక వాదులు పెద్ద ఎత్తున మండి పడుతున్నారు. ఆమె క్యారెక్టర్ ను కించ పరిచేలా పోలీసులు ముందస్తుగానే కామెంట్స్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
G Kishan Reddy Comment about Pravallika Death
దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది సర్కార్. ఇదే సమయంలో బీజేపీ చీఫ్ జి. కిషన్ రెడ్డి(G Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రవల్లిక ఆత్మహత్య చేసుకునేందుకు కారణం ప్రభుత్వమేనంటూ సంచలన ఆరోపణలు చేశారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. గడిచిన 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ సర్కార్ ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేసిన పాపాన పోలేదన్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు జి. కిషన్ రెడ్డి.
కల్వకుంట్ల కుటుంబం నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి. ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోలేదని కేసీఆర్ నిర్వాకం కారణంగానే ఆమె దారుణానికి ఒడిగట్టిందంటూ ఆరోపించారు. మహేశ్వరం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ సర్కార్ ప్రస్తుతం ఎంఐఎం చేతిలో ఉందన్నారు. ఈసారికి ఒక్క ఛాన్స్ బీజేపీకి ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు.
Also Read : Revanth Reddy Arrest : గన్ పార్క్ వద్ద రేవంత్ అరెస్ట్