Tirumala Rush : పుణ్య క్షేత్రం పోటెత్తిన భ‌క్త‌జ‌నం

శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.01 కోట్లు

Tirumala Rush : తిరుమ‌ల – కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమ‌ల‌. ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది భ‌క్తులు స్వామి వారిని స్మ‌రించుకుంటారు. తండోప తండాలుగా తిరుమ‌ల‌కు త‌ర‌లి వ‌స్తున్నారు. రోజు రోజుకు భ‌క్తుల సంఖ్య పెరుగుతోందే త‌ప్పా త‌గ్గ‌డం లేదు. మ‌రో వైపు అక్టోబ‌ర్ 15 నుండి ప్ర‌తి ఏటా నిర్వ‌హించే శ్రీ‌వారి న‌వ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా కొన‌సాగుతున్నాయి. తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో స‌క‌ల ఏర్పాట్లు చేసింది.

Tirumala Rush with Devotees

తాజాగా తిరుమ‌ల లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి, శ్రీ అలివేలు మంగ‌మ్మ‌ల‌ను 72 వేల 123 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. 26 వేల 54 మంది భ‌క్తులు స్వామి వారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించుకున్నారు. నిత్యం స్వామి వారికి స‌మ‌ర్పించే కానుక‌లు, విరాళాల రూపేణా శ్రీ‌వారి హుండీ ఆదాయం రూ. 3.01 కోట్లు వ‌చ్చిన‌ట్లు టీటీడీ(TTD) ఈవో ఏవీ ధ‌ర్మా రెడ్డి వెల్ల‌డించారు.

తిరుమ‌ల‌లో డైరెక్టు లైన్ లైన్ కొన‌సాగుతోంది. మ‌రో వైపు ఎలాంటి టోకెన్లు లేకుండా స‌ర్వ ద‌ర్శ‌నం కోసం వేచి ఉన్న భ‌క్తుల‌కు ద‌ర్శ‌న స‌మ‌యం క‌నీసం 3 గంట‌ల‌కు పైగా ప‌డుతుంద‌ని తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం స్ప‌ష్టం చేసింది.

Also Read : CM KCR : ఏమిచ్చినా రుణం మీ తీర్చుకోలేను

Leave A Reply

Your Email Id will not be published!