AP Govt : ద‌స‌రా సెల‌వుల్లో మార్పు – జ‌గ‌న్

24 వ‌ర‌కు పొడిగించిన ఏపీ స‌ర్కార్

AP Govt : ఆంధ్ర‌ప్ర‌దేశ్ – ద‌స‌రా పండుగను పుర‌స్క‌రించుకుని విద్యా సంస్థ‌ల‌కు ప్ర‌క‌టించిన సెల‌వుల‌లో మార్పు చేసిన‌ట్లు ప్ర‌క‌టించింది ఏపీ స‌ర్కార్. ఈ మేర‌కు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు రాష్ట్ర విద్యా శాఖ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఇందులో భాగంగా విద్యా సంస్థ‌ల‌కు అక్టోబ‌ర్ 23 వ‌ర‌కు ఇప్ప‌టికే సెల‌వులు ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం చిన్నారులు, విద్యార్థులు, విద్యా సంస్థ‌ల‌కు చెందిన సిబ్బంది, టీచ‌ర్లు సెల‌వుల్లో ఉన్నారు.

AP Govt School Holidays Updates

అయితే విద్యార్థులు, పేరెంట్స్ నుంచి వ‌చ్చిన విన‌తి మేర‌కు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(AP CM YS Jagan) మాన‌వ‌తా దృక్ఫ‌థంతో స్పందించారు. మ‌రో రోజు పెంచాల‌ని ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విద్యా శాఖ‌ను ఆదేశించారు. దీంతో అక్టోబ‌ర్ 23 వ‌ర‌కు కాకుండా మ‌రో రోజు సెల‌వుతో అక్టోబ‌ర్ 24 వ‌ర‌కు వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇదిలా ఉండ‌గా రాష్ట్ర ప్ర‌భుత్వం అద‌నంగా మ‌రో రోజు పొడిగించ‌డం ప‌ట్ల విద్యార్థుల‌తో పాటు వారి త‌ల్లిదండ్రులు సైతం తెగ సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. మ‌రో వైపు తెలంగాణ‌తో పాటు విదేశాల‌లో సైతం బ‌తుక‌మ్మ పండుగ‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తుండ‌గా ఏపీలో సైతం మ‌హిళ‌లు బ‌తుక‌మ్మ ఆడ‌డం విశేషం.

Also Read : Chandra Babu Case : నేటితో ముగియ‌నున్న రిమాండ్

Leave A Reply

Your Email Id will not be published!