Chandra Babu Skill Scam : చంద్ర‌బాబుకు బిగ్ షాక్

జ్యుడీషియ‌ల్ రిమాండ్ పొడిగింపు

Chandra Babu Skill Scam : రాజ‌మండ్రి – టీడీపీ చీఫ్ నారా చంద్ర‌బాబు నాయుడుకు దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. ఏపీ స్కిల్ స్కాం కేసులో రిమాడ్ ఖైదీగా ఉన్నారు రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో. ఏసీబీ కోర్టు ఈనెల 19 వ‌ర‌కు విధించిన గ‌డువు పూర్తి కావ‌డంతో మ‌రోసారి విచార‌ణ‌కు వ‌చ్చింది కోర్టులో ఈ కేసు.

Chandra Babu Skill Scam Case Updates

రూ. 371 కోట్ల కుంభ‌కోణం కేసులో కీల‌క‌మైన పాత్ర చంద్ర‌బాబు నాయుడు(Chandra Babu) పోషించారంటూ ఏపీ సీఐడీ ఆరోపించింది. ఈ మేర‌కు పూర్తి నివేదిక‌ను కోర్టులో స‌మ‌ర్పించింది. విచారించిన కోర్టు ధ‌ర్మాస‌నం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఏకంగా వ‌చ్చే నెల న‌వంబ‌ర్ 1 వ‌ర‌కు రిమాండ్ గ‌డువు పొడిగిస్తూ అవినీతి నిరోధ‌క శాఖ కోర్టు తీర్పు చెప్పింది.

అవినీతి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చంద్ర‌బాబుపై వ‌ర్చువ‌ల్ ప్రొసీడింగ్స్ లో ఏసీబీ కోర్టు జ‌డ్జి పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా తాను అనారోగ్యానికి గురైన‌ట్లు , వెంట‌నే బెయిల్ ఇవ్వాల‌ని కోరారు ఆయ‌న త‌ర‌పు లాయ‌ర్లు . జైలులో బాబు భ‌ద్ర‌త‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉండ‌గా త‌న ఆందోళ‌న‌ల‌ను, అనుమానాల‌ను రాత పూర్వ‌కంగా ఇవ్వాల‌ని చంద్రబాబును జ‌స్టిస్ కోరారు.

ఇదిలా ఉండ‌గా చంద్ర‌బాబుపై మూడు కేసులు న‌మోద‌య్యాయి. ఏపీ స్కిల్ స్కాంతో పాటు ఫైబ‌ర్ నెట్ , అమ‌రావతి ఇన్న‌ర్ రింగ్ రోడ్డు కేసులు పిటిష‌న్ దాఖ‌లు చేసింది ఏపీ సీఐడీ.

Also Read : YS Jagan : చంద్ర‌బాబు దోచుకున్న దొంగ‌

Leave A Reply

Your Email Id will not be published!