Rahul Gandhi : ఇల్లు లేక పోయినా జ‌నం గుండెల్లో ఉన్నా

ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ

Rahul Gandhi : జ‌గిత్యాల – ఏఐసీసీ మాజీ చీఫ్‌, వాయ‌నాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను కావాల‌ని కేంద్ర స‌ర్కార్ ఇబ్బంది పెట్టేందుకు ప్ర‌య‌త్నం చేశార‌ని ఆరోపించారు. తెలంగాణ‌లో ఎన్నిక‌ల ప్ర‌చారంలో పాల్గొన్నారు రాహుల్ గాంధీ. ఈ సంద‌ర్భంగా బ‌స్సు యాత్ర చేప‌ట్టారు. అక్క‌డ‌క్క‌డా జ‌రిగే బ‌హిరంగ స‌భ‌ల‌లో ప్ర‌సంగించారు.

Rahul Gandhi Comments

శుక్ర‌వారం జ‌గిత్యాల‌లో రాహుల్(Rahul Gandhi) ప‌ర్య‌టించారు. ప‌లువురిని క‌లిసి ముచ్చ‌టించారు. రాష్ట్రంలో మూత ప‌డిన ఫ్యాక్ట‌రీల‌ను తెరిపిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. త‌న‌కు ఇల్లు లేకుండా చేశార‌ని కానీ ప్ర‌జ‌ల గుండెల్లో ఉన్నాన‌ని అన్నారు రాహుల్ గాంధీ.

మోదీ , బీజేపీ స‌ర్కార్ ఓబీసీల‌కు అన్యాయం చేసింద‌ని ఆరోపించారు. చెరకు, ప‌సుపు రైతుల‌ను ఆదుకుంటామ‌ని అన్నారు . ప‌సుపు మ‌ద్ద‌తు ధ‌ర రూ. 15 వేల‌కు పెంచుతామ‌ని చెప్పారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీకి తెలంగాణ‌తో ఎన‌లేని అనుబంధః ఉంద‌ని గుర్తు చేశారు.

రాష్ట్రంలో దోచుకున్న సొమ్మంతా బీఆర్ఎస్ నేత‌ల జేబుల్లోకి వెళుతోంద‌ని ఆరోపించారు. ఈ ఎన్నిక దొర‌ల తెలంగాణ‌, ప్ర‌జా తెలంగాణ మ‌ధ్య కొన‌సాగుతుంద‌న్నారు. బీజేపీ, బీఆర్ఎస్ , ఎంఐఎం పార్టీలన్నీ ఒక్క‌టేన‌ని ఆరోపించారు రాహుల్ గాంధీ.

Also Read : Chandra Babu Skill Scam : చంద్ర‌బాబుకు బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!