Gone Prakash Rao : బలహీన వర్గాలపై కాంగ్రెస్ వివక్ష
మాజీ కాంగ్రెస్ నేత గోనె ప్రకాశ్ రావు
Gone Prakash Rao : హైదరాబాద్ – తెలంగాణ ఆర్టీసీ సంస్థ మాజీ చైర్మన్ , కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గోనె ప్రకాశ్ రావు సంచలన కామెంట్స్ చేశారు. ఆయన గత కొంత కాలంగా విశ్లేషకుడిగా రాణిస్తున్నారు. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా తెలియ చేస్తూ వస్తున్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రానున్నాయని పేర్కొన్నారు.
Gone Prakash Rao Comments Viral
శుక్రవారం గోనె ప్రకాశ్ రావు(Gone Prakash Rao) మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బలహీన వర్గాలకు తెలంగాణ సారథ్య బాధ్యతలను అప్పగించాలని డిమాండ్ చేశారు. ఇతర పార్టీల్లో నుండి వచ్చిన 12 మందికి టికెట్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు గోనె ప్రకాశ్ రావు.
సర్వే రిపోర్టులు అంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వన వర్గం వాళ్లకే టికెట్లు ఇప్పించు కున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీలో ముందు నుంచి పని చేసిన వాళ్లకు కాకుండా కోట్లు కుమ్మరించిన వాళ్లకు టికెట్లు అమ్ముకున్నారంటూ మండిపడ్డారు. ఇందుకు సంబంధించి హైకమాండ్ పరిశీలించాలని డిమాండ్ చేశారు.
ఖమ్మం జిల్లాలో ఐదు సార్లు ఓడి పోయిన తుమ్మల నాగేశ్వర్ రావు కు కీలకమైన నాయకుడిగా ప్రొజెక్టు చేస్తున్నారంటూ గోనె ప్రకాశ్ రావు ధ్వజమెత్తారు.
Also Read : Rahul Gandhi : ఇల్లు లేక పోయినా జనం గుండెల్లో ఉన్నా
