Dava Vasanatha Suresh : జీవ‌న్ రెడ్డి కామెంట్స్ పై కన్నెర్ర‌

మందు తాగి మాట్లాడుతున్నావా

Dava Vasanatha Suresh : జగిత్యాల – కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు జీవ‌న్ రెడ్డి బ‌తుక‌మ్మ‌పై చేసిన కామెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ‌రోసారి బీఆర్ఎస్ ప‌వ‌ర్ లోకి వ‌స్తే బ‌తుక‌మ్మకు వైన్ బాటిల్స్ ఏర్పాటు చేస్తారంటూ కామెంట్ చేశారు. దీనిపై గులాబీ నాయ‌కురాళ్లు భ‌గ్గుమన్నారు. జీవ‌న్ రెడ్డికి ముతి మ‌తి త‌ప్పింద‌ని మండిప‌డ్డారు.

Dava Vasanatha Suresh Comments Viral

హుందా రాజ‌కీయాలు చేసే మీరు మందు తాగి మాట్లాడుతున్నారంటూ మండిప‌డ్డారు. గౌర‌వ‌మ్మ తెలంగాణ ఆడ ప‌డ‌చుల ఆత్మ గౌర‌వ ప్ర‌తీక అని పేర్కొన్నారు. అలాంటి గౌర‌మ్మ స్థానంలో విస్కీ బాటిల్ పెడ‌తారా అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. బిడ్డ వ‌య‌సున్న ఆడ బిడ్డ‌ను లిక్క‌ర్ క్వీన్ అంటారా అంటూ ఎద్దేవా చేశారు. జిల్లా ప‌రిష‌త్ చైర్ ప‌ర్స‌న్ దావ వ‌సంత సురేష్(Dava Vasanatha Suresh).

ఆమె మీడియాతో మాట్లాడారు. క‌విత‌క్క‌పై ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి చ‌వ‌క‌బారు వ్యాఖ్య‌లు చేయ‌డం దారుణ‌మ‌న్నారు. క‌విత‌ను లిక్క‌ర్ రాణి అని సంబోధించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ఎంపీ అర్వింద్ కు పోటా పోటీగా ఎమ్మెల్సీ మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఇక‌నైనా క‌విత‌క్క‌ను అనే ముందు ఆలోచించుకుని మాట్లాడాల‌ని అన్నారు.

Also Read : MP Laxman : రెండు రోజుల్లో బీజేపీ లిస్టు – ల‌క్ష్మ‌ణ్

Leave A Reply

Your Email Id will not be published!