MP Laxman : రెండు రోజుల్లో బీజేపీ లిస్టు – ల‌క్ష్మ‌ణ్

క్లారిటీ ఇచ్చిన బీజేపీ హైక‌మాండ్

MP Laxman : న్యూఢిల్లీ – భార‌తీయ జ‌న‌తా పార్టీ తెలంగాణ‌లో 119 సీట్ల‌కు సంబంధించి అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసే ప‌నిలో ప‌డింది. ఈ మేర‌కు న్యూఢిల్లీలో పార్టీ హైక‌మాండ్ ప్ర‌త్యేకంగా స‌మావేశం అయ్యింది. ఈ కీల‌క భేటీలో జాతీయ బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా, తెలంగాణ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ త‌రుణ్ చుగ్, రాష్ట్ర పార్టీ ప‌రిశీల‌కుడు ప్ర‌కాశ్ జ‌వ‌దేక‌ర్ , బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి , మాజీ స్టేట్ చీఫ్ బండి సంజ‌య్, జాతీయ ఉపాధ్య‌క్షురాలు డీకే అరుణ భ‌ర‌త సింహా రెడ్డి, ప్ర‌స్తుత పార్టీ చీఫ్‌, కేంద్ర మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డితో పాటు ఎంపీ ల‌క్ష్మ‌ణ్ హాజ‌ర‌య్యారు.

MP Laxman Comment

మీటింగ్ అనంత‌రం ల‌క్ష్మ‌ణ్(MP Laxman) మీడియాతో మాట్లాడారు. తెలంగాణ‌లో పార్టీ ప‌రంగా పోటీ చేసే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేసేందుకు తీవ్ర స్థాయిలో చ‌ర్చించ‌డం జ‌రిగింద‌న్నారు. ఈ మేర‌కు రెండు రోజుల్లో తొలి జాబితా విడుద‌ల చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. బీసీ ఎజెండాతో ఎన్నిక‌ల‌కు వెళ‌తామ‌ని చెప్పారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ స‌ర్కార్ బీసీల‌ను మోసం చేసింద‌ని ఆరోపించారు. రెండు పార్టీల కంటే అధికంగా సీట్ల‌ను కేటాయిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు ఎంపీ ల‌క్ష్మ‌ణ్. సాయంత్రం సెంట్ర‌ల్ ఎల‌క్ష‌న్ క‌మిటీ భేటీ ఉంటుంద‌న్నారు. గ‌త కొన్ని రోజుల నుంచి లిస్టు ఖ‌రారు చేసేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని చెప్పారు.

Also Read : Chandra Babu Case : చంద్ర‌బాబుకు సుప్రీం బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!