Ravula Chandrasekhar Reddy : అయ్యో రావుల ఎందుకిలా

గులాబీ తీర్థం పుచ్చుకున్న మాజీ ఎంపీ

Ravula Chandrasekhar Reddy : హైద‌రాబాద్ – ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా వ‌న‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అంద‌రినీ విస్తు పోయేలా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘ‌మైన రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. ఎమ్మెల్యేగా, రాజ్య‌స‌భ ఎంపీగా, గృహ నిర్మాణ సంస్థ చైర్మ‌న్ గా, తెలుగుదేశం పార్టీలో కీల‌క‌మైన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు.

Ravula Chandrasekhar Reddy Joined in BRS Viral

ఒక ర‌కంగా చెప్పాలంటే సౌమ్యుడిగా, వివాద ర‌హితుడిగా పేరు పొందారు రావుల చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి(Ravula Chandrasekhar Reddy). టీడీపీకి క‌ర్త‌, క‌ర్మ, క్రియ అన్నంత‌గా త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి నేటి వ‌ర‌కు ఆయ‌న ఎక్క‌డా, ఏ పార్టీ వైపు మొగ్గు చూప‌లేదు. చివ‌రి వ‌ర‌కు విలువ‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటార‌ని అనుకున్నారంతా.

కానీ తను కూడా ఉన్న‌ట్టుండి తీవ్ర‌మైన వ్య‌తిరేకత ఎదుర్కొంటున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో భార‌త రాష్ట్ర స‌మితి పార్టీలో చేర‌డం ఒకింత ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ధ‌ర‌ణి పేరుతో పేద‌ల భూములు హాం ఫట్ అవుతుండ‌గా, 2 ల‌క్ష‌ల‌కు పైగా ఖాళీలు ఉన్నా ఒక్క పోస్ట్ భ‌ర్తీ చేయ‌క పోవ‌డాన్ని ప్ర‌శ్నించ‌క పోవడం బాధ క‌లిగించింది. ఏది ఏమైనా ప్ర‌స్తుత పాలిటిక్స్ లో ఒక‌రిద్ద‌రు త‌ప్ప మిగ‌తా వాళ్లంతా ఎక్క‌డ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది.

Also Read : CM KCR : జ‌న‌మే జెండా గెలుపే ఎజెండా

Leave A Reply

Your Email Id will not be published!