CM KCR Yagam Comment : రాజ యోగం సిద్దిస్తుందా
సీఎం కేసీఆర్ యోగం ఫలిస్తుందా
CM KCR Yagam Comment : తెలంగాణ ఉద్యమ సారథిగా, రాష్ట్ర పరిపాలకుడిగా గుర్తింపు పొందిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. ఆయనకు నమ్మకాలు ఎక్కువ. ఆలయాలు దర్శించడం, యాగాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఎన్నికలు జరిగిన సమయంలో రాజ సూయ యాగం చేపట్టారు. ప్రస్తుతం తెలంగాణలో శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గతంలో కంటే ఎక్కువ పోటీని ఎదుర్కొంటున్నారు కేసీఆర్(CM KCR). ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసినా అంతకంటే ఎక్కువ అవినీతి, అక్రమాల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశంలోని ప్రధాన సర్వే సంస్థలన్నీ గంప గుత్తగా కాంగ్రెస్ పార్టీ దూసుకు వస్తోందని , బీఆర్ఎస్ కు కష్ట కాలం మొదలైందని పేర్కొంటున్నాయి. మరికొన్ని సంస్థలు బీఆర్ఎస్ కు అనుకూలంగా వెల్లడించాయి.
CM KCR Yagam Comment Viral
ఏది ఏమైనా ఈసారి మరోసారి హ్యాట్రిక్ సాధించాలని కంకణం కట్టుకున్నారు కేసీఆర్. బీఆర్ఎస్ బాస్ దేనినైనా భరిస్తాడు కానీ ఓటమిని తట్టుకోలేడు. కేవలం కొన్ని వర్గాలకే లబ్ది చేకూర్చేలా ప్రభుత్వం పని చేసింది తప్పా పేదలు, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యంగా యువతకు కోలుకోలేని షాక్ ఇచ్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ధరణి పేరుతో ఉన్నత వర్గాలకు లబ్ది చేకూర్చేలా కేసీఆర్ సర్కార్ చేసిందంటూ జనం గగ్గోలు పెడుతున్నారు. కేసీఆర్ కొలువు తీరిన తర్వాత రెడ్లు, దొరలు, భూ స్వాములు, పెత్దందారులు, దోపిడీదారులు, ఆక్రమణదారులు, అవినీతి పరులు, కబ్జా కోరులు, రౌడీలు పెరిగి పోయారు. ఒక రకంగా చెప్పాలంటే ఆనాటి రజాకర్ల వ్యవస్థను తలపింప చేసేలా పాలన సాగింది.
సామాన్యులకు రక్షణ లేకుండా పోయిందంటూ విపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో జ్యోతి బసు లాగా తాను కూడా హ్యాట్రిక్ కొట్టాలని , సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. ఇందు కోసం తనయుడు కేటీఆర్, అల్లుడు , ట్రబుల్ షూటర్ హరీశ్ రావు రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు, మంత్రులు, చైర్మన్లు, వివిధ హోదాలలో ఉన్న వారందరికీ ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. ప్రత్యేకించి బీఆర్ఎస్ విడుదల చేసిన మేని ఫెస్టో సైతం ఆకట్టుకునేలా లేదని, ప్రత్యేకించి నిరుద్యోగుల ఊసే ఎత్తక పోవడం విస్తు పోయేలా చేసింది. రాష్ట్రంలో 2 లక్షలకు పైగా జాబ్స్ ఖాళీగా ఉన్నా ఇప్పటి వరకు పోస్టుల భర్తీ చేయక పోవడం ప్రధాన అవరోధంగా మారింది. ఏది ఏమైనా సీఎం కేసీఆర్ ప్రజల కంటే స్వామీజీలు, యాగాలను నమ్ముకున్నారు. ఇందు కోసం విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో రాజ శ్యామల యాగానికి శ్రీకారం చుట్టారు. మరి యాగం ఫలిస్తుందా రాజ యోగం సిద్దిస్తుందా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : Rahul Gandhi : కాంగ్రెస్ హస్తం పేదలకు నేస్తం