P Vijay Babu : విజయవాడ – వృత్తిని, ప్రవృత్తిని సమన్వయం చేసుకుంటూ సుదీర్ఘ కాలం జర్నలిస్టులుగా, రచనా వ్యాసంగంలోను రాణించిన వారు వై.ఎస్.ఆర్. జీవన సాఫల్య పురస్కారాలు అందుకోవడం ఆనందించదగ్గ పరిణామమని రాష్ట్ర అధికార భాషా కమీషన్ చైర్మన్ పి.విజయ బాబు అన్నారు.
P Vijay Babu Comments Viral
వై.ఎస్.ఆర్. జీవన సాఫల్య పురస్కారాలు అందుకున్న ప్రముఖ జర్నలిస్టులు, రచయితలకు స్థానిక సి. ఆర్. మీడియా అకాడమీ కార్యాలయంలో చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు అధ్యక్షతన సన్మానం జరిగింది.
ఈ కార్యక్రమానికి పి. విజయ్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. దశాబ్దాల క్రిందట నుంచి పాత్రికేయ వృత్తిలో, రచనా వ్యాసాంగంలో లబ్ద ప్రతిష్ఠులైన వారిని సీఎం జగన్ మోహన రెడ్డి ప్రభుత్వం గుర్తించి గౌరవించడం గొప్ప సాంప్రదాయంగా ఆయన అభివర్ణించారు.
రాష్ట్ర స్థాయి అవార్డుల సభ అనంతరం జర్నలిజం, రచనా వ్యాసాంగంలలో అవార్డులు పొందిన వారిని సి.ఆర్ మీడియా అకాడమీ సత్కరించడం ఆత్మీయ సమ్మేళనంగా భావించాలన్నారు. పాత్రికేయ కుటుంబానికి కొమ్మినేని శ్రీనివాసరావు తమ అకాడమీ వంతుగా చక్కటి ఆత్మీయతను పంచారని అన్నారు. సునిశితంగా, సున్నితంగా వ్యవహరించడం కొమ్మినేని విశిష్టత అని కొనియాడారు.
చైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు మాట్లాడుతూ ప్రతిభకు పట్టం కట్టడం జగన్ మోహన రెడ్డి(CM YS Jagan) ప్రభుత్వం గొప్పతనమని అన్నారు. అనేక సందర్భాల్లో జర్నలిజం రంగంలో తమ తో కలిసి పని చేసిన మిత్రులందరిని ఈ సందర్భంగా సత్కరించుకోవడం తమ బాధ్యత గా భావించానని అన్నారు.
Also Read : Gurajada Apparao : మహాకవి జీవిత విశేషాలు