Vivek Venkata Swamy : గాడి త‌ప్పిన కేసీఆర్ పాల‌న

మాజీ ఎంపీ వివేక్ వెంక‌ట స్వామి

Vivek Venkata Swamy : హైద‌రాబాద్ – బీజేపికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న మాజీ ఎంపీ గ‌డ్డం వివేక్ వెంక‌ట స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను ప‌ద‌వుల కోసం పార్టీలో చేర‌లేద‌న్నారు. గ‌తంలో ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో త‌మ‌కు అనుబంధం ఉంద‌న్నారు. కేవ‌లం తెలంగాణ‌లో రాక్ష‌స పాల‌న నుంచి ప్ర‌జ‌ల‌ను విముక్తి చేయ‌డంలో భాగంగానే తాను పార్టీ తీర్థం పుచ్చుకున్న‌ట్లు చెప్పారు గ‌డ్డం వివేక్ వెంక‌ట స్వామి.

Vivek Venkata Swamy Comment

కేసీఆర్ వ‌ల్ల‌నో లేదా ఆయ‌న కుటుంబం వ‌ల్ల‌నో తెలంగాణ రాష్ట్రం రాలేద‌న్నారు. స‌క‌ల జ‌నులు, సంబండ వ‌ర్ణాలు క‌లిసి పోరాటం చేస్తే, ఎంద‌రో బ‌లిదానాలు, ఆత్మ త్యాగాలు చేస్తే తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్ప‌డింద‌న్నారు.

కాంగ్రెస్ పార్టీ ద‌య వ‌ల్ల సీఎం అయిన చ‌రిత్ర కేసీఆర్ ది అని గుర్తు చేశారు. ఆనాడు సోనియా గాంధీ ఒప్పుకోక పోతే తెలంగాణ వ‌చ్చి ఉండేది కాద‌న్నారు. ఇక బీజేపీ కేవ‌లం బీఆర్ఎస్ కు బి టీమ్ గా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించారు. రాష్ట్రంలో తాను పోరాటం చేయాల‌ని ఉన్నా త‌న‌కు స‌రైన ప్రాతినిధ్యం ఇవ్వ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

బంగారు తెలంగాణ పేరుతో నాలుగున్న‌ర కోట్ల ప్ర‌జ‌ల చెవుల్లో పూలు పెట్టారంటూ ఆరోపించారు. కుటుంబం మొత్తం అవినీతికి పాల్ప‌డింద‌ని, ఆయ‌న అంతం త‌న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు గ‌డ్డం వివేక్ వెంక‌ట‌స్వామి(Vivek Venkata Swamy). తాను ఎక్క‌డి నుంచి పోటీ చేయాల‌నే విష‌యం హై క‌మాండ్ చూసుకుంటుంద‌న్నారు.

Also Read : Revanth Reddy : కాళేశ్వ‌రం మోసం కేసీఆర్ కు శాపం

Leave A Reply

Your Email Id will not be published!